జగపతిబాబు పేరు వింటేనే మనకు గుర్తుకొచ్చేది ఆయన నటించిన కటుంబ కథా చిత్రాలు. అలాంటి వాటిలో 'శుభలగ్నం', 'మావిడాకులు', 'సర్దుకుపోదాం రండి' లాంటి అనేక చిత్రాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ హీరో విలన్ పాత్రల్లో నటించి మెప్పిస్తున్నాడు. తాజాగా చిరంజీవి కొత్త సినిమాలోనూ జగ్గూభాయ్ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.
మలయాళంలో వచ్చిన 'లూసిఫర్' చిత్రం తెలుగులో రీమేక్‌గా తెరకెక్కనుంది. ఇందులో కథానాయకుడిగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు. 'సాహో' ఫేమ్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబును ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేయనున్నట్లు చెప్పుకుంటున్నారు.
ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న 'ఆచార్య' చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత 'లూసిఫర్' సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.