'బాహుబలి' సినిమా తర్వాత ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. విదేశాల్లో కూడా ఆయనకు ఎంతోమంది అభిమానులున్నారు. దీంతో, ప్రభాస్ సినిమాల గురించి విదేశీ మీడియాలో కూడా వార్తలు వస్తుంటాయి.
ప్రస్తుతం ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజులుగా ఇటలీలో జరుగుతోంది. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ మేరకు 'రాధేశ్యామ్' షూటింగ్ గురించి ఇటలీ మీడియా ప్రత్యేక కథనాల్ని ప్రసారం చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
-
#Italy media reports about #RadheShyam shooting that is taking place at Piemonte. Channel @TgrRai carries an exclusive feature of the shooting. #Prabhas @hegdepooja @director_radhaa @UV_Creations #Vamsi #Pramod @justin_tunes @bhagyashree123 #NM @onlynikil #NikilMurukan pic.twitter.com/EOKVTbFltu
— Nikil Murukan (@onlynikil) October 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#Italy media reports about #RadheShyam shooting that is taking place at Piemonte. Channel @TgrRai carries an exclusive feature of the shooting. #Prabhas @hegdepooja @director_radhaa @UV_Creations #Vamsi #Pramod @justin_tunes @bhagyashree123 #NM @onlynikil #NikilMurukan pic.twitter.com/EOKVTbFltu
— Nikil Murukan (@onlynikil) October 29, 2020#Italy media reports about #RadheShyam shooting that is taking place at Piemonte. Channel @TgrRai carries an exclusive feature of the shooting. #Prabhas @hegdepooja @director_radhaa @UV_Creations #Vamsi #Pramod @justin_tunes @bhagyashree123 #NM @onlynikil #NikilMurukan pic.twitter.com/EOKVTbFltu
— Nikil Murukan (@onlynikil) October 29, 2020
రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ వింటేజ్ ప్రేమకథా చిత్రంలో ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు అందిస్తున్నారు. అలనాటి తార భాగ్యశ్రీ, సత్యరాజ్, జగపతిబాబు, జయరాం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది.
ఇదీ చదవండి:'కలర్ ఫొటో' టీమ్‌కు రవితేజ అభినందనలు