ETV Bharat / sitara

'ఇస్మార్ట్ శంకర్' హీరోతో మురుగదాస్! - మురుగదాస్​తో రామ్ పోతినేని

ప్రముఖ దర్శకుడు మురుగదాస్​ మరో కొత్త చిత్రానికి సిద్ధమైనట్లు సమాచారం. రామ్ పోతినేని హీరోగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Ram, Murugdass
రామ్, మురుగదాస్
author img

By

Published : Jun 4, 2021, 10:57 AM IST

'గజిని', 'స్టాలిన్‌', '7th సెన్స్' ,'స్పైడర్‌', 'దర్బార్‌'లాంటి సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు మురుగదాస్‌. తమిళంతో పాటు తెలుగులోనూ తనకంటూ అభిమానగణాన్ని సంపాదించుకున్నారు. త్వరలోనే ఆయన 'ఇస్మార్ట్‌ శంకర్‌' హీరో రామ్‌ పోతినేనితో ఓ సినిమా చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే మురుగదాస్‌, రామ్‌ని కలిసి కథను కూడా వినిపించారట. అతనికి కథ నచ్చడం వల్ల గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని చెప్పుకొంటున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది.

రామ్ ఇప్పటికే మరో తమిళ దర్శకుడు లింగుస్వామితో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. అందులో 'ఉప్పెన' భామ కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. మాధవన్‌ ప్రతినాయకుడిగా నటించనున్నారట. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ పతాకంపై ఆ చిత్రం నిర్మితమవుతోంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఇందులో రామ్‌ పోలీస్‌ అధికారిగా కనిపిస్తారట. శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా తెలుగు - తమిళంలో తెరకెక్కనుంది.

ఇవీ చూడండి:

Family man 2: సమంత అదరగొట్టిందిగా!

SPB Jayanthi: స్వరాలై గుండెల్లో పుడుతూనే ఉంటావ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.