ETV Bharat / sitara

రెండు నెలల్లో 50 సినిమాలు.. టాలీవుడ్​ కోలుకున్నట్లేనా? - కరోనా టాలీవుడ్ ఎఫెక్ట్

కొవిడ్, లాక్​డౌన్ ప్రభావాల నుంచి టాలీవుడ్​ దాదాపు కోలుకున్నట్లే కనిపిస్తోంది. ఈ ఏడాది తొలి రెండు నెలల్లో 50 సినిమాలు విడుదలవగా, చాలావాటిని ప్రేక్షకులు ఆదరించారు. ఈ లెక్కన చూసుకుంటే రాబోయే రోజుల్లో థియేటర్ల దగ్గర మరింత సందడి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Is Tollywood recover from covid effect?
రెండు నెలల్లో 50 సినిమాలు.. టాలీవుడ్​ కోలుకున్నట్లేనా?
author img

By

Published : Mar 6, 2021, 6:29 AM IST

'బాగుంది'... అనిపించిన సినిమా ఎప్పట్లాగే వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఫిబ్రవరి నెలలో కొత్త రికార్డుల మాటా వినిపించింది. చాలా రోజుల తర్వాత మళ్లీ ప్రేక్షకులు థియేటర్ల దగ్గర క్యూ కట్టారు. ఆ ఉత్సాహంలోనే వారం వారం ఐదారు సినిమాలకు తగ్గకుండా దూసుకొస్తున్నాయి. ఈ లెక్కన మన బాక్సాఫీసు గాడిన పడినట్టేనా? కరోనా సంక్షోభం నుంచి చిత్రసీమ తేరుకున్నట్టేనా?

'ప్రేక్షకులు మునుపటిలా వస్తారా? రారా?' అనే సందేహాల మధ్యే తెలుగునాట థియేటర్లు తెరుచుకున్నాయి. 50 శాతం మంది ప్రేక్షకులతో ప్రదర్శనలు మొదలయ్యాయి. రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు రాగానే సంక్రాంతి సినిమాలు ముస్తాబై బాక్సాఫీసు ముందుకొచ్చాయి. అలా తెలుగు సినీ పరిశ్రమ పునరుద్ధరణలో తొలి నెలలో విడుదలైనవి కీలకపాత్ర పోషించాయి. ఆ వెంటనే వందశాతం ప్రేక్షకులతో ప్రదర్శనలకు అనుమతుల రాకతో తెలుగు చిత్రసీమ మరో అడుగు ముందుకేసింది.

raviteja Krack movie
క్రాక్​ మూవీలో రవితేజ

ఫిబ్రవరిలో మలుపు

మన దేశంలో కరోనా పరిస్థితుల తర్వాత వేగంగా కోలుకుంటున్న చిత్రసీమ మనదే. బాలీవుడ్‌లో ఇప్పటిదాకా విడుదలలే ఊపందుకోలేదు. మిగతా చిత్రసీమల్లో విడుదలవుతున్నా... వసూళ్ల జోరు కనిపించడమే లేదు. తెలుగులో మాత్రం సంక్రాంతి నుంచే వసూళ్ల గలగలలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరిలో అయితే మరో అడుగు ముందుకేసింది. కొత్త రికార్డుల మాట వినిపిస్తూ 'ఉప్పెన' సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. రూ.70 కోట్లకుపైగా గ్రాస్‌ వసూళ్లు సాధించింది. ఓ హీరో తొలి సినిమా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం విశేషం. సంక్రాంతికి విడుదలైన 'క్రాక్‌' రూ. 70 కోట్లకుపైగా గ్రాస్‌ వసూళ్లు సొంతం చేసుకుంది. యాభై శాతం మంది ప్రేక్షకులతో ప్రదర్శనలు కొనసాగినా రవితేజ కథానాయకుడిగా నటించిన ‘క్రాక్‌’ ఆ స్థాయిలో వసూళ్లు సొంతం చేసుకోవడం విశేషం. ఫిబ్రవరిలో విడుదలైన ‘జాంబీరెడ్డి’, ‘ఉప్పెన’, ‘నాంది’ చిత్రాలు మంచి వసూళ్లు సొంతం చేసుకున్నాయి. చిత్రసీమ గాడిన పడినట్టే అనే నిరూపించేలా ఫలితాల్ని రాబట్టాయి.

కంటెంటే కీలకం

కరోనా తర్వాత ప్రేక్షకుల అభిరుచుల్లో మరిన్ని మార్పులొస్తాయని సినీ పండితులు మొదట్నుంచీ చెబుతున్నారు. అందుకు తగ్గట్టే ఉంది ప్రేక్షకుల స్పందన. కథాబలం ఉన్న సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మూసధోరణిలో సాగే వాటి వైపు కన్నెత్తి చూడటం లేదు. ఫిబ్రవరిలో విడుదలైన ‘ఉప్పెన’, ‘నాంది’, ‘జాంబీరెడ్డి’ విజయవంతం అయ్యాయంటే కారణం ఆ కథల్లో ఉన్న బలమే. సినిమాల్లో విషయం ఉండి, తగినట్టుగా ప్రచారం చేసుకుంటే మంచి ఫలితాలొస్తాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ వారం విడుదలైన 11 సినిమాల్లో ఒకట్రెండు మినహా చాలా వాటికి ప్రేక్షకులు లేక థియేటర్లు వెలవెలబోయాయి. కొన్ని చోట్ల షోలూ రద్దయ్యాయి.

uppena movie
ఉప్పెన మూవీ

"ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఎప్పుడూ సిద్ధమే. కరోనా తర్వాత వయసుపైబడిన కొద్దిమంది ప్రేక్షకులే రావడానికి వెనకడుగు వేస్తున్నారు కానీ, మిగతావాళ్లు సినిమా బాగుందని తెలిస్తే టికెట్టు కొనేస్తున్నారు. సినీ రూపకర్తలు ప్రధానంగా కథలపై దృష్టిపెట్టాల్సి ఉంటుంది" అని అన్నారు ఓ నిర్మాత.

అప్పుడే హాఫ్‌ సెంచరీ

తొలి రెండు నెలల్లోనే తెలుగు చిత్రసీమలో యాభై సినిమాలు విడుదల కావడం విశేషం. జనవరిలో సుమారు 20 చిత్రాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరిలో 30కి పైగా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. విడుదలలతో పోల్చి చూసుకుంటే విజయాల శాతం తక్కువే... అయినా చిత్రసీమ శరవేగంగా అడుగులు వేస్తోందనే విషయం మాత్రం స్పష్టమవుతోంది. మార్చి ఘనంగానే ప్రారంభమైంది. ఈ శుక్రవారమైతే ఏకంగా 11 చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ ఉద్ధృతి చూస్తుంటే ఈ ఏడాది విడుదలయ్యే సినిమాల సంఖ్య 300 దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.