హీరో రామ్‌చరణ్-స్టార్ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుంది. ఇటీవల ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే వీరిద్దరి క్రేజీ కాంబోలో సినిమా అనగానే.. అభిమానుల్లో భారీగా ఆసక్తి నెలకొంది. వైవిధ్యంగా సినిమాలను తెరకెక్కించే శంకర్ ఈ సారి చరణ్‌తో ఏ జోనర్లో చిత్రాన్నిచేస్తారనే విషయమై సినీప్రేక్షకుల్లో చర్చలు మొదలయ్యాయి.
అయితే.. శంకర్ చాలా రోజుల క్రితమే తాను ప్రస్తుతం తెరకెక్కిస్తోన్న 'భారతీయుడు 2' చిత్రం తర్వాత చేయబోయే సినిమా జోనర్ గురించి చెప్పారు. సైన్స్‌ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిస్తానని వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ నేపథ్యంలో చెర్రీతో తీయబోయే సినిమా సైన్స్ ఫిక్షన్ అయి ఉంటుందని భావిస్తున్నారంతా. ప్రస్తుతం రామ్‌చరణ్ 'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. సినిమా షూటింగ్ తుదిదశకు చేరుకుంది. ఈ చిత్రం తర్వాతే శంకర్-చెర్రీ సినిమా పట్టాలెక్కనుంది.
ఇదీ చూడండి: శంకర్ దర్శకత్వంలో చెర్రీ.. అప్డేట్ వచ్చేసింది