ETV Bharat / sitara

అభినయ ఊర్వశి.. ఈ సినీ సరస్వతి 'శారద' - sharada latest birth day special story

తన నటనతో ప్రేక్షకులను మెప్పించి.. ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి అభినయ ఊర్వశిగా పేరు తెచ్చుకున్న నటి శారద పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆమె వ్యక్తిగత జీవితంతో పాటు, సినీ ప్రస్థానం, అందుకున్న పురస్కారాల గురించి తెలుసుకుందాం.

INDIAN ACTRESS SHARADA BIRHD DAY SPECIAL STORY
శారద
author img

By

Published : Jun 25, 2020, 8:06 AM IST

"శారదా... నను చేరగా... ఏమిటమ్మా సిగ్గా...

ఎరుపెక్కే లేత బుగ్గ...

ఏమి రూపమది...ఇంద్రచాపమది

ఏమి కోపమది...చంద్రతాపమది

ఏమి... ఆ హొయలు...? ఏమి ఆ కులుకు.."

ఒకప్పుడు ఆంధ్రదేశాన్ని ఊపేసిన పాట అది. కథానాయిక పేరునే చిత్ర శీర్షికగా పెట్టడం.. ఆ నాయిక పేరుతో ఓ పాట పుట్టడం.. అప్పట్లో ఆనవాయితీ. అదే వరుసలో వచ్చిన ఈ పాట అభినేత్రి శారద సినీ రూపానికి సరికొత్త గ్లామర్‌ అద్దింది. శారద పేరు తలవగానే.. చాలామంది ప్రేక్షకులకు ఈ పాట గుర్తొచ్చి తీరుతుంది. అంతలా ఒకప్పుడు ఆకట్టుకున్న పాట అది. ఈ పాటలో అక్షరక్షరాన భావ కవిత్వం సొగసులు పోతుంది. పరికిణీ, తెల్ల వోణీ, సిగలో మల్లెలతో ఈ పాటలో శారద హృదయాలను దోచుకుంటుంది. అత్యద్భుతమైన అభినయాన్ని మించిన అందం మరోటి ఉంటుందా? ఈ దృష్టి కోణంతో చూస్తే మహా ప్రతిభావంతురాలయిన శారద అందాల రాశి.. సమ్మోహన సౌందర్యాల ఊర్వశి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఔను.. శారద నిజంగా అభినయ ఊర్వశి. ఈ సంగతి ఆమెకు లభించిన జాతీయ పురస్కారమే చెప్తుంది. అప్పట్లో ఉత్తమ నటన ప్రదర్శించే నటీమణులకు జాతీయ స్థాయిలో ఊర్వశి పురస్కారంతో సత్కరించేవారు. అలా ఆ సత్కారాన్ని పొందిన శారద ఊర్వశి శారదగా మారి ఇటు ప్రేక్షకుల హృదయాల్లోనూ, అటు సినిమా చరిత్రలోనూ స్వర్ణాక్షరాలతో లిఖించగల ఖ్యాతి కేతనాన్ని దిగంతాలకు ఎగురవేసింది. గ్రేట్‌ లెజెండరీ యాక్టెస్ర్‌ శారద సినీసీమని సుసంపన్నం చేసింది.

రచ్చ గెలిచిన అభినయం..

ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది అనాదిగా వస్తున్న నానుడి. అయితే రచ్చ గెలిచిన తరువాతే ఇంట గెలిచిన సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది ఈ నటీమణి. తెలుగు నటే కానీ, మలయాళ చిత్ర పరిశ్రమలో నభూతో నభవిష్యత్‌ అనదగ్గ మంచి పాత్రలెన్నో పోషించి.. జాతీయ స్థాయి ఉత్తమ నటిగా విఖ్యాతి గాంచింది. ఆ తర్వాతే పుట్టిల్లయిన తెలుగు చిత్ర పరిశ్రమ ఆమె ప్రతిభకు పట్టాభిషేకం చేసింది. ఆమె మాత్రమే నటించగల పాత్రల్ని రచయితలు సృష్టించారు. ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయాలంటూ నిర్మాత దర్శకులు ఆమె ఇంటి ముందు క్యూ కట్టారు. అంతే.! ఆ తర్వాత తెలుగు సినిమాని ముచ్చటగా తన కొంగున ముడేసుకుంది. అపూర్వమైన తన నటనతో ప్రేక్షక జనాల కళ్లు తడిపేసింది. తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ భాషల్లో అవిశ్రాంతంగా సినిమాలు చేసింది. మూడుసార్లు జాతీయ ఉత్తమ నటిగా, రెండు సార్లు ఫిలిం ఫేర్‌ అవార్డుల విజేతగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ద్వారా ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు స్వీకర్తగా... చరిత్ర సృష్టించింది.

INDIAN ACTRESS SHARADA BIRHD DAY SPECIAL STORY
శారద

సరస్వతి శారదగా.. ఊర్వశి శారదగా

ముచ్చటయిన మూడక్షరాల మూడు పేర్లు శారద సొంతం. పుట్టగానే తల్లితండ్రులు పెట్టిన పేరు సరస్వతి. పెరిగి పెద్దయి సినీరంగంలో ప్రవేశించిన తరువాత ఆమె పేరు శారద. అభినయ ప్రతిభకు గుర్తింపుగా అందుకున్న అవార్డు ఊర్వశి. ఇలా ఆమె మూడు పేర్లతో మూడక్షరాల సినీ ప్రపంచంలో తన ముద్ర ప్రగాఢంగా వేసింది. వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆంధ్రప్రదేశ్‌ తెనాలిలో 1945 జూన్‌ 25న శారద పుట్టింది. తండ్రి వెంకటేశ్వరరావు, తల్లి సత్యవతీ దేవి. వారిది వ్యవసాయ కుటుంబం. శారదకి ఓ సోదరుడున్నాడు. ఆయన పేరు మోహనరావు. చిన్నతనంలో చెన్నయ్‌లో ఉంటున్న అమ్మమ్మ దగ్గర శారద పెరిగింది. అమ్మమ్మ చాలా క్రమశిక్షణతో అనేక ఆంక్షల మధ్య తనను పెంచిందని శారద చాలాసార్లు ఆనాటి బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆ అనుభవాల్ని సన్నిహితులతో పంచుకునేవారు. సినిమాల్లో నటిస్తున్న సమయంలో కూడా హీరోలు తనని తాకరాదని అడ్డు చెప్పేదట.

నాటక రిహార్శల్స్‌కి కేవలం ఆదివారాల్లో మాత్రమే అనుమతించేదట. అవన్నీ అమ్మమ్మ శారదకు మిగిల్చిన తీపి గుర్తులు. తండ్రి వెంకటేశ్వరరావుకి శారద సినిమాల్లోకి వెళ్లడం అంత ఇష్టం ఉండేది కాదు. అలాగని...ఆమె అభిరుచిని ఏనాడూ అడ్డగించలేదు. అభ్యంతరం చెప్పలేదు. శారద తల్లి సత్యవతీ దేవికి మాత్రం తన కూతురు సినిమాల్లో రాణించాలని బలీయంగా కోరుకునేది. కారణం...స్వతహాగా ఆమెకి నటిగా తెరపై కనిపించాలన్న ఆశ ఉన్నా నెరవేర్చుకోలేకపోయింది. దాంతో... తన కూతురినైనా ఆర్టిస్ట్‌గా చూడాలని ఆమె అభిలషించింది. ఆరేళ్ల వయస్సు నుంచే నృత్యాభినయంలో శారద శిక్షణ పొందింది. మొదట్లో అంతగా గుర్తింపునకు నోచుకోని పాత్రలతో సరిపెట్టుకున్న శారద ఆ తరువాత కొన్ని సినిమాల్లో హాస్య పాత్రల్లో కూడా కనిపించింది. నెమ్మది నెమ్మదిగా తన ప్రతిభకు రాణింపు తెచ్చే కీలక కధానాయిక పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి... అసమాన నటనకు శారద కూడా ఓ చిరునామా అనిపించేలా ఎదిగింది. ఆమె మొదటి సినిమా 1955లో వచ్చిన 'కన్యా శుల్కం'. ఇందులో ఆమె పాత్ర చాలా చిన్నది.

'ఇద్దరు మిత్రుల'తో శారదకు గుర్తింపు

శారద అనే నటి ఒకరు ఉన్నట్టు గుర్తింపు తీసుకు వచ్చిన చిత్రం 1961లో వచ్చిన ‘ఇద్దరు మిత్రులు’. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఈ చిత్రం అప్పట్లో సూపర్‌ డూపర్‌ హిట్‌. బహుళ జనాదరణ పొందిన చిత్రం అవడం మూలాన ఈ చిత్రంలో తారాగణం గురించి ప్రేక్షకులకు బాగా తెలిసింది. అంటే కాదు... ఇండస్ట్రీ కూడా శారదని గుర్తించింది. అప్పటి నుంచి ఆమె సినీయానం ఊపందుకుంది. అయినా సరే... మలయాళ ఇతర భాషల్లో వచ్చినట్లు తనలోని నటిని సవాల్‌ చేసే పాత్రలు తెలుగులో ఆ తరువాత కొద్దికాలం వరకూ ఆమెకి అందలేదు.

అక్కున చేర్చుకున్న మలయాళం

శారదలో ప్రతిభావంతురాలైన నటిని మలయాళ పరిశ్రమ గుర్తించి అక్కున చేర్చుకుంది. సినీ కెరీర్‌లో మూడుసార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్న శారద.. రెండు సార్లు మలయాళ చిత్రాల్లో నటనకే అందుకుంది. 1968లో మలయాళ చిత్రం 'తులాభారం', 1972లో 'స్వయంవరం' చిత్రాలకు ఈ అవార్డులు ఆమెకి దక్కాయి. 1977లో 'నిమజ్జనం' తెలుగు సినిమాకిగాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. మలయాళ చిత్రాల్లో 'శకుంతల', 'ఉద్యోగస్థ', 'మురపెన్ను' చిత్రాల తరువాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. మలయాళంలోనే 'తిలోత్తమ', 'పాకల్కికినవు', 'మాణిక్య కొటారం', 'కరుణ', 'జైల్‌', 'అర్చన',.. అలా లెక్కకు మిక్కిలి సినిమాలున్నాయి. చాలా చిత్రాలు విజయవంతమై శారదకు మంచి పేరు తెచ్చాయి. 1963లో తమిళంలోకి శారద ప్రవేశించారు. మొదటి చిత్రం 'కుంగుమం' అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత 'తులసి మేడం', 'అరుణగిరినటర్‌', 'తులాభారం' తదితర చిత్రాల్లో నటించారు. కన్నడంలోనూ కొన్ని సినిమాలు చేసిన శారద హిందీలో అడుగు పెట్టి నటిగా నిరూపించుకున్నారు. బాలీవుడ్​లో 1970లో 'సమాజ్‌ కో బదల్‌ డాలో', 1973లో 'అగ్ని రేఖ', 1980లో 'ప్రతీశోద్‌', 1982లో 'సిందూర్‌ బనే జ్వాలా', 'మై ఇంత్‌ కామ్‌ లూంగా', 1984లో 'సర్దార్‌', 1996లో 'షబ్‌ సి బడే మవాలి', 2008లో 'యార్‌ మేరీ జిందగీ' చిత్రాల్లో నటించింది.

తెలుగులో చక్కని చిత్రాలు

తెలుగులో చక్కని చిత్రాలు శారద చేసింది. తోబుట్టువులు, దాగుడు మూతలు, మైరావణ, మురళి కృష్ణ, శ్రీమతి, భక్త పోతన్న, చదువుకున్న భార్య, మన సంసారం, శ్రీ రామకథ, మనుషులు మారాలి, సంబరాల రాంబాబు, పసిడి మనసులు, సిసింద్రీ చిట్టిబాబు, చెల్లెలి కాపురం చిత్రాల్లో ఆమె నటన అమోఘం. జీవిత చక్రం, సతీ అనసూయ, పగబట్టిన పడచు, అమాయకురాలు, కాలం మారింది, మానవుడు దానవుడు, శారద, విశాలి, మల్లమ్మ కధ.. లాంటి చిత్రాలు శారద కెరీర్‌కి వన్నె తెచ్చాయి. 2013 వరకూ ఆమె నటిస్తూనే ఉంది. ఎన్టీఆర్, మోహన్‌ బాబు చిత్రం 'మేజర్‌ చంద్ర కాంత్‌'లో కీలక పాత్ర పోషించింది. అగ్ర హీరోలందరి సరసన మంచి పాత్రల్లో రాణించిన శారద ఆ తర్వాత అమ్మగా, అత్తగా, అమ్మమ్మగా కూడా నటించింది. 'కూలి నంబర్‌ వన్‌'లో వెంకటేష్‌కి అత్త పాత్రలో రాని ఇంగ్లీష్‌తో నానా తంటాలు పడుతూ నవ్వించింది. 'జీవిత చక్రం', 'బలిపీఠం', శారద... ఇలా చాలా పాత్రల్లో ప్రతిభ కనపరిచినా...‘మనుషులు మారాలి’ చిత్రం ఆమె కెరీర్‌కి ప్రత్యేకం. ఈ సినిమాతో ఆమె కీర్తి సినీజగద్విఖ్యాతం.

అవార్డులు-పురస్కారాలు

మూడు సార్లు జాతీయ ఉత్తమ నటిగా అవార్డులు స్వీకరించింది. 2013లో తమిళనాడు రాష్ట్ర అవార్డు 'కలై మామణి' పురస్కారాన్ని అందుకుంది. 1970లో 'తార' సినిమాలో ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర పురస్కారాన్ని పొందింది. 1987లో మలయాళ చిత్రం 'ఓరు మిన్నమునుంగుంటే నురంగువెట్టం' చిత్రానికి ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్‌ అవార్డు అందుకుంది. 1997లో ఫిలిం ఫేర్‌ జీవన సాఫల్య పురస్కారంతో శారదను ఫిలిం ఫేర్‌ సత్కరించింది.

నంది అవార్డు

ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం నంది అవార్డు అందించి శారదను సత్కరించింది. 1984లో 'బొబ్బిలి బ్రహ్మన్న' సినిమాలో నటనకుగాను ఉత్తమ సహాయ నటిగా శారదను నంది వరించింది. 2010లో ఎన్టీఆర్‌ జాతీయ జీవన సాఫల్య పురస్కారాన్ని అందించింది.

చలంతో వివాహం... విడాకులు

సహచర నటుడు చలంతో శారద వివాహం జరిగింది. కొన్నాళ్లకే ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం శారద చెన్నైలోని తన సోదరుడి కుటుంబంతో కలిసి ఉంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.