'ఇండియన్-2' చిత్రీకరణలో క్రేన్ మీద పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన కేసులో... విచారణకు హాజరయ్యాడు ప్రముఖ నటుడు కమల్ హాసన్. చెన్నై పోలీసుల ఎదుట ప్రమాదానికి సంబంధించిన కారణాలు వెల్లడించాడీ కోలీవుడ్ హీరో.
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఇండియన్-2' సినిమా షూటింగ్లో.. ఫిబ్రవరి 19న ప్రమాదం జరిగింది. ఇందులో ముగ్గురు మరణించారు. ఈ ప్రమాదంపై లైకా సంస్థ యజమానితో పాటు, సినీ నిర్మాతలు, క్రేన్ యజమాని, ఆపరేటర్లపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా కమల్, దర్శకుడు శంకర్లకు విచారణకు హాజరవ్వాలని నోటీసులు జారీ చేశారు. ఫలితంగా నేడు కమల్ పోలీసుల ముందు హాజరయ్యాడు.
ఇదీ చదవండి: తండ్రిని చదివించిన కొడుకు... కారణం అదే!