సంగీత దిగ్గజం ఇళయరాజా దగ్గర సరిగమలు నేర్చుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు! బుడిబుడి అడుగులు వేసే వయసులోనే నేనూ నేర్చుకుంటా తాతా అంటూ ఆయన మనవరాలు (సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా కూతురు) అడిగిందేమో. వెంటనే పియానోతో సరాగాలు పలికించడం ఎలానో ఈ చిన్నారికి నేర్పించే ప్రయత్నం చేశారు ఇళయరాజా. ఈ విశేషాన్ని తన ఫోన్‌లో బంధించి ఇటీవల సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు యువన్ శంకర్ రాజా.
ఈ వీడియో చూసిన గాయనీగాయకులు, నటులు బాగుంది అంటూ కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఇళయరాజా.. తెలుగులో 'రంగమార్తాండ' చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">