తన సినిమా 'అమర్ అక్బర్ ఆంటోని'.. ఇప్పట్లో విడుదలయ్యుంటే 'బాహుబలి 2' కలెక్షన్లను అధిగమించేదని అభిప్రాయపడ్డారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. ఈ చిత్రం వచ్చి నేటికి 43 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ట్విట్టర్ దానిని గుర్తు చేసుకుని పోస్ట్ పెట్టారు. అప్పట్లోనే రూ.7.5 కోట్ల వసూళ్లను సాధించి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిందని రాసుకొచ్చారు. ముంబయిలోని 25 థియేటర్లలో 25 వారాల పాటు నిర్విరామంగా ప్రదర్శన చేసిన రికార్డు ఇంకా చెక్కుచెదరలేదని అన్నారు.
-
T 3544 -43 YEARS .. !!! .. 'Amar Akbar Anthony' is estimated to have made Rs 7.25 crore in those days. Inflation-adjusted, it crosses the collections of Bahubali 2—The Conclusion today!
— Amitabh Bachchan (@SrBachchan) May 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
#43YearsOfAmarAkbarAnthony pic.twitter.com/u5IMiOV2zt
">T 3544 -43 YEARS .. !!! .. 'Amar Akbar Anthony' is estimated to have made Rs 7.25 crore in those days. Inflation-adjusted, it crosses the collections of Bahubali 2—The Conclusion today!
— Amitabh Bachchan (@SrBachchan) May 27, 2020
#43YearsOfAmarAkbarAnthony pic.twitter.com/u5IMiOV2ztT 3544 -43 YEARS .. !!! .. 'Amar Akbar Anthony' is estimated to have made Rs 7.25 crore in those days. Inflation-adjusted, it crosses the collections of Bahubali 2—The Conclusion today!
— Amitabh Bachchan (@SrBachchan) May 27, 2020
#43YearsOfAmarAkbarAnthony pic.twitter.com/u5IMiOV2zt
ముగ్గురు అన్నదమ్ముల జీవితాలతో నడిచే కథతో 'అమర్ అక్బర్ ఆంటోని' తీశారు. చిన్నతనంలోనే తప్పిపోయిన వీరిని మూడు కుటుంబాలు చేరదీస్తాయి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్లుగా వీరు పెరుగుతారు. వారిలో ఒకరు పోలీస్.. మరొకరు సింగర్‌గా.. ఇంకొకరు మద్యం షాప్ ఓనర్‌గా ఎదుగుతారు. ఆ తర్వాత వీరి జీవితంలో ఏం జరిగింది? వారు ఎలా కలిశారనేది ఆసక్తికరంగా తెరకెక్కించారు దర్శక-నిర్మాత మన్మోహన్ దేశాయ్. కేదర్ ఖాన్ రచయితగా పనిచేశారు. వినోద్ ఖన్నా, అమితాబ్ బచ్చన్, రిషి కపూర్, షభానా అజ్మీ, పర్వీన్ బాబీ, నీతూ సింగ్‌లు ప్రధానపాత్రలు పోషించారు.
లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన అమితాబ్.. ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించడం సహా సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులను అందించారు. ఇటీవలే 'కౌన్ బనేగా కరోడ్‌పతి' ప్రోమో షూట్లోనూ పాల్గొన్నారు.
ఇదీ చూడండి... 'బిచ్చగాడు' సీక్వెల్‌కు కథ సిద్ధం చేసిన విజయ్