కరోనా వ్యాప్తిని అరికట్టటంలో భాగంగా ప్రస్తుతం భారతదేశం లాక్డౌన్లో ఉంది. 21 రోజులపాటు ఎవరూ బయటకు రావొద్దని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. అయితే పూర్తి సమయం ఇంట్లోనే ఉండటం బోర్ కొట్టిందన్నాడు హీరో సైఫ్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్. అందుకే ఇంటి నుంచి తప్పించుకుని, ఇలా వచ్చేశానంటూ ఓ సరదా ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఇందులో భూమికి సంబంధించిన ఫొటో గోడపై అంటించి ఉండగా, దాని పక్కన నిల్చుని ఉన్నాడు ఇబ్రహీం.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
త్వరలోనే బాలీవుడ్‌లోకి?
బాలీవుడ్ కథానాయకుడు సైఫ్ అలీఖాన్, అమృతాసింగ్లకు ఇద్దరు సంతానం. కుమార్తె సారా అలీఖాన్.. ప్రస్తుతం హీరోయిన్గా పలు సినిమాల్లో నటిస్తుంది. ఇబ్రహీం త్వరలో సినీ రంగ ప్రవేశం చేయనున్నాడని సమాచారం.
ఇదీ చదవండి: కరోనా కట్టడికి మహేశ్‌బాబు ఆరు సూత్రాలు