ETV Bharat / sitara

ఆరు నిమిషాల్లో ఆ పాట రాసిన హీరో ధనుష్.. ఇంతకీ ఎలా సాధ్యం? - dhanush sir movie

Dhanush kolaveri di: అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ ఫుల్​ బిజీగా ఉన్న హీరో ధనుష్​లో అదిరిపోయే రైటింగ్ టాలెంట్ కూడా ఉంది! ఇంతకీ అదేంటి అంటారా?

Dhanush
ధనుష్
author img

By

Published : Jan 17, 2022, 12:13 PM IST

Dhanush movie songs: ధనుష్.. ఈ హీరో మల్టీ టాలెంటెండ్. హీరో, రచయిత, సింగర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్.. ఇలా చాలా వాటిలో తన ప్రతిభ చూపి అదరగొట్టారు. ప్రస్తుతం తెలుగులోనూ రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో 'సార్', డైరెక్టర్ శేఖర్ కమ్ములతో చిత్రాలు ఉన్నాయి. హాలీవుడ్​లోనూ 'గ్రే మ్యాన్' సినిమాలో నటిస్తున్నారు ధనుష్. అయితే తన సినిమలోని ఓ పాటను కేవలం ఆరు నిమిషాల్లో రాశానని గతంలో ధనుష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంతకీ ఆ పాటేంటి? దాని సంగతేంటి?

ధనుష్ భార్య ఐశ్వర్య దర్శకత్వం వహించిన సినిమా '3'. మానసిక సమస్యలు నేపథ్య కథాంశంతో తీసిన ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటించారు. ఇందులోని 'కొలవెరి డీ' పాట స్వయంగా రాసి, పాడారు కూడా. ఈ సాంగ్​నే కేవలం ఆరు నిమిషాల్లో రాశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ పాట గురించి ఆలోచన వచ్చినప్పుడు అందరి తెలిసిన పదాలతో రాయాలని అనుకున్నానని ధనుష్ చెప్పారు. అందులో భాగంగానే ఆరు నిమిషాల్లో పలు ఇంగ్లీష్ పదాలతో దీనిని పూర్తి చేశానని, 35 నిమిషాల్లో రికార్డింగ్ కూడా పూర్తయిందని తెలిపారు. అయితే పాటలో ఇంగ్లీష్ పదాలను తమిళ యాసతో పాడేసరికి జనాలకు విపరీతంగా నచ్చేసిందని అన్నారు.

అప్పట్లో యూట్యూబ్​, సోషల్ మీడియాలో సెన్షేషన్​గా నిలిచిన ఈ పాట.. కేవలం దక్షిణాదిలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎందరినో ఆకట్టుకుంది. పలు భాషల్లో ఈ గీతాన్ని రీమిక్స్​ కూడా చేయడం విశేషం.

Dhanush rajnikanth
మామ రజనీకాంత్​తో ధనుష్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.