ETV Bharat / sitara

ఆ జోనర్​లో నటించాలని ఉంది: సాయిపల్లవి - సాయిపల్లవి

కామెడీ జోనర్​ సినిమాలో నటించాలని ఉందని చెప్పారు నటి సాయిపల్లవి. సరైన స్క్రిప్ట్​ కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. ఇంకా తన గురించి పలు ఆసక్తికర సంగతులను చెప్పారు.

saipallavi
సాయిపల్లవి
author img

By

Published : Nov 3, 2021, 1:44 PM IST

కామెడీ సినిమాలో నటించాలనే కోరిక చాలా రోజులుగా ఉందని తన మనసులో మాటను చెప్పారు నటి సాయిపల్లవి. సరైన కామెడీ స్ప్రిప్ట్​ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. తనదైన శైలి నటన, డ్యాన్స్​తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పల్లవి. ఇటీవలే శేఖర్​ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'లవ్​స్టోరీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చి విజయాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలో కాస్త బ్రేక్​ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇన్​స్టాలో సరదాగా అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగానే తన మనసులోని మాటను బయటపెట్టారు.

"కామెడీ జోనర్​లో ఓ సినిమా చేయాలని ఉంది. అలాంటి పాత్ర చేసినప్పుడు ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో చూడాలి. ప్రాపర్​ కామెడీ స్క్రిప్ట్​ కోసం ఎదురుచూస్తున్నా" అని చెప్పారు. ఇంట్లో ఉన్నప్పుడు, ఖాళీ సమయాల్లో ఏం చేస్తారని మరో నెటిజన్​ అడగగా.. బాగా తిని హాయిగా నిద్రపోతానని తెలిపింది. ఇటీవల చూసిన సినిమాల్లో ​'డ్యూన్'(హాలీవుడ్​)​, 'సర్దార్​ ఉద్ధమ్'​(హిందీ) నచ్చాయని చెప్పారు. పకృతి ఒడిలో సేద తీరడం ఇష్టమని వెల్లడించారు. ఫిజికల్​ ఫిట్​నెస్​తో పాటు మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇస్తారని చెప్పుకొచ్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

త్వరలోనే సాయిపల్లవి.. రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'విరాటపర్వం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం నాని 'శ్యామ్​సింగ్​రాయ్'​ చిత్రంలో నటిస్తోంది.

ఇదీ చూడండి: అందం విషయంలో భయాలుండేవి: సాయిపల్లవి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.