హీరోయిన్ కాజల్ అగర్వాల్(kajal Agarwal) త్వరలోనే తల్లి కావాలని కోరుకుంటున్నట్లు ఆమె సోదరి, నటి నిషా అగర్వాల్ చెప్పింది. శనివారం, కాజల్ పుట్టినరోజు సందర్భంగా ఓ ఇంటర్వ్వూలో పాల్గొన్న నిషా ఈ వ్యాఖ్యలు చేసింది.
"కాజల్‌కు త్వరలోనే బిడ్డ పుట్టాలని ఆశిస్తున్నాను. పెళ్లి అయినప్పటి నుంచి ఆమెకు చెబుతూనే ఉన్నాను. ఎందుకంటే ఆలస్యమైపోతే నా కుమారుడికి చెల్లి లేదా తమ్ముడితో గడిపే అవకాశం దొరకదు. ఇప్పటికే వాడి వయసు మూడేళ్లు. కాబ్టటి కాజల్ తన భర్త.. పిల్లల కోసం ప్రయత్నాలు చేయాలని అనుకుంటున్నాను. నా కొడుకు.. అతడికి ఓ తమ్ముడు లేదా చెల్లిలు కావాలని అడుగుతున్నాడు"
-నిషా అగర్వాల్, నటి
ముద్దుగుమ్మ 'కాజల్' గతేడాది మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో ఏడడుగులు వేసింది. అతి తక్కువ మంది అతిథుల మధ్య వీరి వివాహ వేడుక ముంబయిలో ఘనంగా జరిగింది.
ప్రస్తుతం కాజల్.. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న 'ఆచార్య'(Acharya) సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. 'హే సినామికా', 'ఇండియన్ 2', 'ఘోస్టీ', 'ప్యారిస్ ప్యారిస్' సినిమాలతో పాటు నాగార్జున-ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలోనూ కథానాయికగా చేస్తోంది.
ఇదీచూడండి: ఘనంగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి