వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. అయితే తన బ్రాండ్‌ను, సక్సెస్‌ను అంత సీరియస్‌గా తీసుకోనని చెబుతున్నాడీ ఖిలాడీ కథానాయకుడు. దర్శకుడు చెప్పిన ప్రకారమే పనిచేస్తానని, విజయాలకు ఏ ట్రిక్స్లు లేవని.. నిజ జీవిత అనుభవాల నుంచే నేర్చుకున్నానని చెప్పాడు.
"నేను యాక్టింగ్ స్కూలుకు వెళ్లలేదు. ఎక్కడా ఏమి నేర్చుకోలేదు. నా అనుభవాల నుంచే నేర్చుకున్నా. నా పని నేను చేసుకుంటూ వెళ్తా. మిగతా విషయాలను (జయాపజయాలు) పట్టించుకోను. నా డైరెక్టర్ ఏది చెప్తే అదే చేస్తా. అంతా అతడి చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే సినిమా అనే నౌకకు అతనే కెప్టెన్." -అక్షయ్ కుమార్, బాలీవుడ్ హీరో
తన కెరీర్ ప్రారంభంలో ఒకే జోనర్ సినిమాలు చేసి తప్పు చేశానని తెలిపాడు అక్షయ్.
"ఎప్పుడూ ఒకే రకమైన కథలు చేయకూడదు. అన్ని జోనర్లూ ప్రయత్నించాలి. నా కెరీర్ ఆరంభంలో ఒకే విధమైన చిత్రాల్లో నటించి తప్పు చేశా. అప్పుడు ఎక్కువగా యాక్షన్ కథలకే ప్రాధాన్యమిచ్చా. విభిన్న కథలు చేస్తే సినిమాలను ఎంజాయ్ చేయొచ్చు" -అక్షయ్‌కుమార్, బాలీవుడ్ హీరో
అయితే చిత్ర విడుదలకు ముందు ఇప్పటికీ టెన్షన్ పడుతుంటానని చెప్పాడు ఖిలాడీ హీరో.
"నేను చేసే చిత్రాలన్నింటిపై ఆత్మవిశ్వాసంతో ఉండలేను. ప్రతి సినిమాకూ ఎంతో కష్టపడతా. నిడివి సరిపోయిందా లేదా, ప్రేక్షకులు, కుటుంబం, విమర్శకులు ఎలా రియాక్ట్ అవుతారో అని చిత్రం విడుదలకు ముందు కొంచెం భయం వేస్తుంది." -అక్షయ్ కుమార్, బాలీవుడ్ హీరో
జీవితంలో విమర్శించే వాళ్లు ఉండటం ఎంతో ముఖ్యమంటున్నాడు అక్షయ్.
"మీ జీవితాల్లో తప్పనిసరిగా విమర్శించే వాళ్లు ఉండాలి. అందరి అభిరుచులు ఒకేలా ఉండవు. అంతెందుకు నేను చేసిన చిత్రాల్లో నా భార్యకు చాలా సినిమాలు నచ్చవు. ఇలా మన జీవితాల్లో ఒకరైనా విమర్శకులు ఉండాలి" - అక్షయ్ కుమార్, బాలీవుడ్ హీరో
ఇటీవలే అక్షయ్ నటించిన హౌస్‌ఫుల్-4 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్‌తో వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. సాజిద్ నడియావాలా నిర్మించిన ఈ చిత్రానికి ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించాడు. రితేశ్ దేశ్‌ముఖ్, బాబీ దేఓల్, కృతి సనన్, పూజాహెగ్డే, రానా దగ్గుపాటి, చుంకీ పాండే తదితరులు కీలకపాత్రలు పోషించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: సూపర్‌హీరో పాత్రలో అదరగొడుతున్న సన్నీ లియోనీ