కృతిసనన్, వరుణ్‌ధావన్ కలిసి జంటగా నటిస్తున్న బాలీవుడ్ హర్రర్ కామెడీ చిత్రం 'భేడియా'. అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 19న అరుణాచల్ ప్రదేశ్‌లో పూర్తి చేసుకుంది.
ఈ చిత్రం గురించి కృతి మాట్లాడుతూ.."నాకు వ్యక్తిగతంగా హార్రర్, భయానకంగా ఉండే చిత్రాలంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. అయితే భేడియాలో హాస్యం చాలా ఎక్కువగా ఉంటుంది. షూటింగ్‌లో ఎంజాయ్ చేశాను. రక్తపిశాచి, తోడేలు ప్రపంచాన్ని ఇందులో చూసి సంబరపడ్డా. ఈ చిత్ర కథలో చమత్కార పాత్రలలో పాటు వినోదం కూడా ఉంటుంది. దర్శకుడు అమర్ కౌశిక్ ఇలాంటి సినిమాలు తీయడంలో ఇప్పటి తరంలో బాగా పట్టున్న దర్శకుడు. ఆయన తీసిన 'స్త్రీ' చూశాను. చాలా బాగా తెరెక్కించారు. హర్రర్, హాస్యాన్ని కలిపి చూపించే విధానంలో ఆయనకు చాలా ప్రతిభ ఉంది. ఆ విధానమే నాకు చాలా బాగా నచ్చిందని" తెలిపింది.
మడోక్ ఫిల్మ్స్ , జియో స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దినేష్ విజ్జన్ నిర్మాత. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం కృతి ససన్-ప్రభాస్‌తో కలిసి 'ఆదిపురుష్'లో నటించనుంది. ఇందులో ఆమె సీత పాత్రలో కనిపించనుంది. ఇక అక్షయ్ కుమార్‌తో కలిసి 'బచ్చన్ పాండే' సినిమాలో ‘మైరా’ అనే పాత్రలో నటిస్తోంది. జాక్వీలిన్ ఫెర్నాండజ్, అర్షద్ వార్షి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.