ETV Bharat / sitara

'కూలీలకు సాయం చేయడంలో ఆ ఉద్దేశం లేదు' - sonu says he is working purely of love

రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఉద్దేశంతోనే ఈ సేవాకార్యక్రమాలు చేస్తున్నానే ఆరోపణలపై స్పందించారు నటుడు సోనూసూద్​. తనకు అలాంటి ఉద్దేశమే లేదని.. స్వచ్ఛమైన మనసుతోనే వారికి సాయం చేస్తున్నట్లు చెప్పారు.

sonu
సోనూ సూద్​
author img

By

Published : Jun 10, 2020, 6:05 PM IST

లాక్​డౌన్​ వల్ల చిక్కుకుపోయిన వలసకూలీలను వారి స్వస్థలాలకు చేరవేసేందుకు నటుడు సోనూసూద్​ తీవ్రంగా కృషి చేస్తున్నారు. స్వయంగా ఆయనే రంగంలోకి దిగి సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోని పలువురు ప్రముఖులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తుండగా.. శివసేన​ ఎంపీ సంజయ్​ రౌత్​ విమర్శలు చేశారు. భాజాపా చేతిలో సోనూ కీలుబొమ్మ అని, రాజకీయ ప్రవేశం కోసం ఈ సేవలందిస్తున్నారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు పలువురు సోనూ గురించి ఇలానే మాట్లాడారు. వీటిపై స్పందించిన సోనూ.. తనకు రాజకీయాల్లో చేరాలనే ఆలోచన లేదని అన్నారు.

"రాజకీయాల్లో చేరేందుకు కాదు, మంచి మనసుతో ఈ సేవా కార్యక్రమాలను చేస్తున్నాను. వలసకూలీలు స్వస్థలాలకు చేరుకుని తమ కుటుంబాలను కలుసుకోవాలనేదే నా ముఖ్య ఉద్దేశం. చివరి కూలీ తన ఇంటికి చేరేవరకు ఇదే ఉత్సాహంతో పనిచేస్తూనే ఉంటాను"

-సోనూ సూద్​, ప్రముఖ నటుడు

సోనూసూద్​.. ఇప్పటివరకు దాదాపు 18 నుంచి 20వేల మంది వలస కూలీలను ప్రత్యేక వాహనాల ద్వారా ఒడిశా, బిహార్​, ఉత్తర్​ప్రదేశ్​, ఝార్ఖండ్​ రాష్ట్రాలకు చేర్చారు. ఇటీవల కేరళలో చిక్కుపోయిన 177మంది మహిళలను ప్రత్యేక విమానం ద్వారా తమ స్వస్థలమైన ఒడిశాకు చేర్చి మంచిమనసును చాటుకున్నారు. ఆకలితో అలమటిస్తోన్న వేలాదిమందికి ఉచితంగా ఆహారం అందించడం సహా ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు.

ఇది చూడండి : 'భాజపా చేతిలో సోనూసూద్​ కీలుబొమ్మ​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.