రాధికా ఆప్టే.. విభిన్న చిత్రాలతో తనకంటూ పత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి. గతేడాది ఈ హీరోయిన్ నటించిన 'అంధాధున్', 'ప్యాడ్ మ్యాన్' సినిమాలు జాతీయ పురస్కారాలు అందుకున్నాయి. ఇందుకు గర్వంగా ఉన్నా.. అవార్డులపై తనకు ఆసక్తి లేదంటోందీ భామ.
"నేను నటించిన రెండు చిత్రాలకు జాతీయ అవార్డులు వచ్చినందుకు ఆనందంతో పాటు గర్వంగానూ ఉంది. అందరికీ ధన్యవాదాలు. అయితే, పురస్కారాలు రావాలనే ఉద్దేశంతో సినిమాలు అంగీకరించను. ప్రేక్షకులు ఇష్టపడాలనే అభిప్రాయంతోనే చేస్తా.. అవార్డులపై అంత ఆసక్తి లేదు" -రాధికా ఆప్టే, బాలీవుడ్ నటి.
రాధిక నటించిన 'ప్యాడ్‌మ్యాన్' సినిమా ఉత్తమ సామాజిక చిత్రంగా జాతీయ పురస్కారం గెలుచుకుంది. 'అంధాదున్' ఉత్తమ హిందీ చిత్రంతో పాటు మూడు పురస్కారాలు అందుకుంది.
ఆయుష్మాన్ ఖురానాకు ఉత్తమ నటుడు కేటగిరీలో.. రచయిత శ్రీరామ్ రాఘవన్‌కు ఉత్తమ అడాప్టడ్ స్కీన్‌ప్లే విభాగంలో జాతీయ పురస్కారాలు వచ్చాయి.
ఇదీ చూడండి: హీరో రాజ్‌తరుణ్‌కు తప్పిన ప్రమాదం