బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్.. రాముడి నేపథ్యంతో తెరకెక్కిస్తోన్న 'రామసేతు' సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జరగనున్నట్లు తెలుస్తోంది. చిత్రీకరణ అనుమతి కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను అక్షయ్ కలిసినట్లు తెలుస్తోంది. అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తుండగా, అరుణ్ భాటియా, విక్రమ్ మల్హోత్రా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
![akshay kumar rama sethu cinema](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9763531_ramasethu.jpg)
హృతిక్ రోషన్ కొత్త సినిమా
ప్రముఖ కథానాయకుడు హృతిక్ రోషన్.. మరోసారి సిద్ధార్థ్ ఆనంద్‌తో కలిసి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి 'ఫైటర్' టైటిల్ కూడా అనుకుంటున్నారట. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన 'బ్యాంగ్ బ్యాంగ్', 'వార్' చిత్రాలు విశేషాదరణ సొంతం చేసుకున్నాయి.
'క్రిష్ 4', 'వార్' సీక్వెల్‌తో బిజీగా ఉన్న హృతిక్.. 2022 ప్రారంభంలో 'ఫైటర్' షూటింగ్ మొదలుపెట్టనున్నారట. అన్నీ కుదిరితే అదే ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయనున్నారని సమాచారం.
![hritik roshan cinema](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/hr02_0412newsroom_1607079768_608.jpg)