అమెరికాకు చెందిన గెర్ష్ ఏజెన్సీ అనే నిర్మాణసంస్థ తెరకెక్కించే సినిమాలో.. బాలీవుడ్ నటుడు హృతిక్ నటించనున్నాడు. ఇప్పటికే ఆ సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. హృతిక్‌ను హాలీవుడ్‌కి పరిచయం చేయడమే కాకుండా.. భారత్‌లో అనేక చిత్రాలను రూపొందించటమే లక్ష్యంగా ఆ సంస్థ ప్రణాళిక రచిస్తోంది.
"హృతిక్ రోషన్.. 20 ఏళ్లుగా భారతీయ చిత్రపరిశ్రమలో విభిన్న కథలలో నటిస్తున్నాడు. ప్రపంచీకరణ, వైవిధ్యం వైపు భారతదేశాన్ని ముందు స్థానంలో ఉంచడానికి హృతిక్ నాయకత్వంలో ముందుకెళ్తాం. ఇందుకోసం గెర్ష్ భాగస్వామ్యంలో హృతిక్ పనిచేయనున్నాడు".
- అమ్రితా సేన్, సెలబ్రిటీ మేనేజ్మెంట్ ఫర్మ్ ఇండియా మేనేజర్
బాలీవుడ్ దర్శకుడు రాకేశ్ రోషన్ వారసుడే హృతిక్ రోషన్. 2000లో 'కహో నా ప్యార్ కియా' సినిమాతో తెరంగేట్రం చేశాడు. 'ఫిజా మిషన్ కశ్మీర్', 'కోయి మిల్ గయా', 'ధూమ్ 2', 'జోధా అక్బర్', 'గుజారిష్', 'జిందగీ నా మిలేగీ దుబారా', 'అగ్నిపథ్', 'క్రిష్' సిరీస్ సినిమాలతో.. విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు. గతేడాది విడుదలైన 'సూపర్ 30', 'వార్' సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కొల్లగొట్టాడు.
ఇదీ చూడండి.. చిరు 152: రామోజీ ఫిలింసిటీలో మెగాస్టార్ పోరాటాలు