ETV Bharat / sitara

'ఎన్ని ఇళ్లు కూలుస్తారు? ఎంతమంది గొంతులు కోస్తారు?'

రిప్లబిక్​ టీవీ​ ఎడిటర్​ అర్ణబ్​ గోస్వామిని ముంబయి పోలీసులు అరెస్టు చేయడాన్ని బాలీవుడ్ నటి కంగనా రనౌత్​ ఖండించారు. ప్రశ్నించే ఎంతోమంది స్వేచ్ఛను మహారాష్ట్ర ప్రభుత్వం హరిస్తుందని ధ్వజమెత్తారు.

how many voices will you stop asked kangana ranaut
'ఎన్ని ఇళ్లు కూలుస్తారు? ఎంతమంది గొంతులు కోస్తారు?'
author img

By

Published : Nov 4, 2020, 9:27 PM IST

ప్రముఖ న్యూస్​ ఎడిటర్‌ అర్ణబ్‌ గోస్వామిని అరెస్టు చేయడాన్ని బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌ ఖండించారు. ట్విట్టర్‌ వేదికగా మహారాష్ట్ర ప్రభుత్వానికి తన సందేశం పంపారు. 2018లో కాన్‌కార్డ్‌ డిజైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ అన్వయ్‌ నాయక్‌, ఆయన తల్లి ఆత్మహత్యలకు సంబంధించిన కేసులో పోలీసులు అర్ణబ్‌ గోస్వామిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విషయంలో రాయ్​గఢ్‌‌, ముంబయి పోలీసులు ఓ సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించారు. ఏపీఐ సచిన్‌ వాజే నాయకత్వంలోని పోలీసు బృందం అర్ణబ్‌ గోస్వామిని అదుపులోకి తీసుకుంది.

"ఇవాళ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని విషయాలు అడగాలి అనుకుంటున్నా. మీరు అర్ణబ్‌ గోస్వామి ఇంటిలోకి చొరబడ్డారు. అతడ్ని కొట్టారు, జుట్టుపట్టుకుని లాగారు, వేధించారు. ఇలా మీరు ఎన్ని ఇళ్లను కూలుస్తారు?.. ఎంతమంది గొంతులు కోస్తారు?.. ఎంత మంది గళాన్ని అణచివేస్తారు?.. ఎంత మందిని జుట్టు పట్టుకుని అవమానిస్తారు? ఈ స్వరాలు ఇలానే పెరుగుతూనే ఉంటాయి. మాకు ముందు.. తమ భావాల్ని స్వేచ్ఛగా బహిర్గతం చేసిన చాలా మంది అమరవీరులను ఉరి తీశారు. మీరు పప్పు సేన, సోనియా సేన.."

- కంగనా రనౌత్​, బాలీవుడ్​ నటి

అర్ణబ్‌కు చెందిన రిపబ్లిక్‌ టీవీ టీఅర్పీ రేటింగ్స్‌ కోసం మోసాలకు పాల్పడిందన్న ఆరోపణలపై కూడా విచారణ ఎదుర్కొంటోంది. అర్ణబ్‌ అరెస్టును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, ఇతర కేంద్ర మంత్రులు ప్రకాశ్‌ జావడేకర్‌, స్మృతి ఇరానీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు ఖండించారు. మహారాష్ట్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.