రుతుస్రావం సమయంలో వాడే శానిటరీ న్యాప్కిన్లపై మహిళలకు అవగాహన పెంచే నేపథ్యంలో తెరకెక్కిన సినిమా 'ప్యాడ్మాన్'. శానిటరీ ప్యాడ్స్‌ను తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చిన తమిళనాడుకు చెందిన అరుణాచలమ్ మురగనాథమ్ బయోపిక్‌గా ఈ చిత్రం రూపొందింది. ఇందులో అక్షయ్‌కుమార్, సోనమ్‌కపూర్, రాధికా ఆప్టే ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా విడుదలై నేటికి రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అక్షయ్‌కుమార్ ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు. సామాజిక సమస్యగా చూసే రుతుస్రావంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ సినిమా దోహదపడిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధిగమించడానికి చేరువలో ఉన్నామని భావిస్తున్నట్లు తెలిపారు.
"సామాజిక సమస్య రుతుస్రావంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ సినిమా దోహదపడటం నాకు సంతోషంగా ఉంది. ఇలాంటి సామాజిక సమస్యలను అధిగమించడంలో చేరువలో ఉన్నామని భావిస్తున్నా."
-అక్షయ్ కుమార్, బాలీవుడ్ హీరో.
2018లో విడుదలైన ప్యాడ్మాన్.. సామాజిక సమస్యలను ఎత్తిచూపిన సినిమాల విభాగంలో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును అందుకుంది. ఆర్ బల్కీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.
ఇదీ చూడండి : ఆ దేశాల్లో నిషేధించిన చిత్రాలే ఇక్కడ సూపర్ హిట్లు