ప్రస్తుతం దబాంగ్-3లో నటిస్తోంది సోనాక్షిసిన్హా. ఇక్కడికి రావడం సొంత ఇంటికి వచ్చినట్టుందని..ఈ సిరీస్‌లో మరిన్ని సినిమాలు రావొచ్చని తెలిపిందీ ముద్దుగుమ్మ.
ఇటీవలే షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. సల్మాన్‌తో హీరోయిన్గా నటించడం ఈమెకు ఇది మూడోసారి.
దబాంగ్ సిరీస్‌లో నటించండం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సిరీస్‌లో మరిన్ని చిత్రాలు తీస్తారని అనుకుంటున్నా. రాజో పాత్ర నాలోనే ఉంది. నిద్రలో లేపి చేయమన్నా ఆ పాత్రను అవలీలగా చేస్తాను. ప్రభుదేవాతో మరోసారి పనిచేయడం ఆనందంగా ఉంది" -- సోనాక్షి సిన్హా, హీరోయిన్
ఈ మధ్యే భారతదేశాన్ని సందర్శించిన 'అవెంజర్స్ ఎండ్ గేమ్' దర్శకుడు జో రూసో...దబాంగ్ సినిమాల్ని ప్రశంసించాడు.
దబాంగ్-3...గత రెండు సినిమాలకు ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం, గతం ఇలా రెండు ఉంటాయని హీరోయిన్ సోనాక్షి తెలిపింది.
ఈ సినిమాల్లోనే కాకుండా కళంక్, మిషన్ మంగళ్, భుజ్ సినిమాల్లో నటిస్తోంది సోనాక్షి.