Puneeth Rajkumar: కన్నడ పవర్‌స్టార్, దివంగత నటుడు పునీత్ రాజకుమార్‌ను మరణానంతరం డాక్టరేట్‌తో గౌరవించింది మైసూర్ యూనివర్సిటీ. గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్.. పునీత్ సతీమణి అశ్వినికి ఈ పురస్కారాన్ని అందజేశారు. అవార్డు తీసుకునే సమయంలో పునీత్‌ను తలచుకుని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
Puneeth Rajkumar Honorary Doctorate
డాక్టరేట్ ప్రదానానికి ముందు క్రాఫోర్డ్ హాల్లో పునీత్ చిన్ననాటి ఫొటోలను ఎల్ఈడీ స్క్రీన్‌పై ప్రదర్శించారు. యూనివర్సిటీ 102వ స్నాతకోత్సవంలో భాగంగా మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది. పునీత్ రాజ్‌కుమార్ కుమార్తె, రాఘవేంద్ర రాజ్‌కుమార్, ఇతర కుటుంబసభ్యులు హాజరయ్యారు.
గతేడాది అక్టోబర్‌లో గుండెపోటుతో అకాల మరణం చెందారు పునీత్. దీంతో ఆయన అభిమానులు సహా సినీ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. పునీత్ నటించిన చివరి చిత్రం జేమ్స్ గతవారమే థియేటర్లలో విడుదలై సంచలన విజయం సాధించింది. ఫ్యాన్స్ సహా ప్రేక్షకులంతా పునీత్‌ను వెండితెరపై చూసేందుకు థియేటర్లకు బ్రహ్మరథం పట్టారు. దీంతో కన్నడ సినీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తొలిరోజు అత్యధిక మంది ఈ సినిమాను చూసినట్లు విశ్లేషకులు చెప్పారు.
ఇదీ చదవండి: బీస్ట్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. కేజీఎఫ్-2కు పోటీగా..