ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ తమ కొత్త చిత్రాన్ని కన్నడ పవర్‌స్టార్ పునిత్ రాజ్‌కుమార్‌తో చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రానికి పవన్‌కుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఈ ఏడాది ద్వితియార్థంలో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని తెలిపింది.

'ఆకాశవాణి' చిత్రంలోని 'మనకొన' అనే తొలి పాటను ఏప్రిల్ 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఈ పాటను మంగ్లీ పాడగా.. అనంత శ్రీరామ్ రచించారు. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో సముద్రఖని ప్రధానపాత్రలో నటిస్తుండగా, అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నారు.

వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన 'ఉప్పెన' మూవీలోని 'ఈశ్వర' పాట ప్రేక్షకాదరణ సంపాదించుకుంది. ఇటీవల కృతిశెట్టి ఈ పాటకు నాట్యరూపం ఇచ్చింది. మంగళవారం ఈ గీతానికి సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ నటిస్తోన్న కొత్త చిత్రం 'గని'. ఇందులో విలక్షణ నటుడు ఉపేంద్ర అతిథిపాత్ర పోషించనున్నారు. మంగళవారం ఉగాది సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

ఇదీ చూడండి: నెట్టింట పవర్‌స్టార్ రచ్చ... ట్రెండింగ్‌లో టీజర్