ETV Bharat / sitara

సెప్టెంబరు నుంచి 'మిషన్ ఇంపాజిబుల్ 7' షూటింగ్! - టామ్​ క్రూజ్​ కొత్త సినిమా అప్​డేట్​

లాక్​డౌన్​ సడలించిన నేపథ్యంలో ఈ సెప్టెంబరు నుంచి హాలీవుడ్​ చిత్రం 'మిషన్​ ఇంపాజిబుల్​ 7' చిత్రీకరణ ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇందులో ప్రముఖ నటుడు టామ్ క్రూజ్ హీరోగా నటిస్తున్నాడు.

Hollywood Movie 'Mission Impossible 7' begins in September
సెప్టెంబరులో హాలీవుడ్​ సినిమా షూటింగ్ షురూ!
author img

By

Published : Jun 3, 2020, 6:33 PM IST

హాలీవుడ్ స్టార్​ హీరో టామ్‌ క్రూజ్‌ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'మిషన్‌ ఇంపాజిబుల్‌ 7'. కరోనా కారణంగా ఈ సినిమా చిత్రీకరణ‌ మార్చి నుంచి నిరవధిక వాయిదా పడింది. అయితే ఈ ప్రాజెక్టు షూటింగ్‌ను సెప్టెంబరులో తిరిగి ప్రారంభించాలని చిత్రబృందం భావిస్తోంది.

ఇందులో నటిస్తున్న సైమన్‌ పెగ్‌ (బెంజీ డున్‌ పాత్రధారి).. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "చిత్రీకరణలో పాల్గొనే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు సెట్‌కు వచ్చిన తర్వాత వైద్యపరీక్షలు చేయించాలి. మరీ వీటిని ఎలా చేస్తారో లేదో నాకైతే తెలియదు" అని వెల్లడించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

యాక్షన్‌ డ్రామాగా తీస్తున్న ఈ చిత్రానికి క్రిస్టోఫర్ మెక్‌క్వారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వింగ్ రేమ్స్, రెబెకా ఫెర్గూసన్, వెనెస్సా కిర్బీ, హేలే అట్వెల్, హెన్రీ సెర్నీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. పారామౌంట్‌ పిక్చర్స్ పంపిణీదారుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది నవంబర్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి... 'వైద్యుల్లో ఉత్సాహం నింపేందుకే వర్చువల్​ సిరీస్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.