బాలనటిగా, హీరోయిన్గా దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకున్న మీనా.. గురవారం(సెప్టెంబరు 16)తో 46 వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆమె గురించి ప్రత్యేక కథనం.
అంకుల్ అని పిలిచిన రజనీతో రొమాన్స్
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి 'ఎంకేయు ఎట్ట కురుల్' సినిమాలో బాలనటిగా చేసిన మీనా.. ఆ సమయంలో ఆయనను అంకుల్ అని పిలిచేది. ఆ తర్వాత 'వీర', 'ముత్తు', 'యజమాన్', 'అవ్వాయ్ షణ్ముగి', 'రిథమ్' తదితర సినిమాల్లో రజనీ సరసన హీరోయిన్గా నటించింది. అయితే చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన తనకు.. ఆయనతో రొమాంటిక్ సీన్స్ చేయడం కాస్త ఇబ్బందిగా ఉండేదని తెలిపింది. మరోవైపు కెరీర్ ప్రారంభంలోనే ఆయన లాంటి స్టార్‌తో పనిచేస్తున్నందుకు ఆనందంగానూ ఉండేదని 'ఆలీతో సరదాగా' షోకు ఆమె గతంలో హాజరైనప్పుడు చెప్పింది.
మీనా ఫ్యాన్స్‌ను చూసి రజనీ ఆశ్చర్యం
యజమాన్(తెలుగులో 'యజమాని') షూటింగ్ కోసం రాజమండ్రి వచ్చినప్పుడు తనకెదురైన పరిస్థితిని మీనా అలీతో పంచుకుంది.
అప్పుడే 'చంటి' సినిమా రిలీజైందని, ఆ సమయంలో రజనీకాంత్‌తో కలిసి షూటింగ్ కోసం రాజమండ్రి వచ్చానని మీనా తెలిపింది. అయితే తిరిగి వెళ్లేటప్పుడు రైల్వేస్టేషన్లో ఉన్న చాలామంది జనం తనను గుర్తుపట్టి అరుపులు, కేరింతలు వేశారని ఆమె చెప్పింది.
అప్పుడు కాస్త ఇబ్బంది పడుతూనే ట్రైన్ కంపార్ట్మెంట్లోకి ఎక్కానని మీనా తెలిపింది. ఆ తర్వాత కొంతసేపటికి తన దగ్గరకి వచ్చిన రజనీకాంత్.. ఏంటమ్మా ఆ జనం అంతమంది అని షాకయ్యారని చెప్పింది. 'గాడ్ బ్లస్ యూ' అంటూ తనను దీవించారని మీనా పేర్కొంది.
ఇప్పుడు అదే రజనీకాంత్‌తో కలిసి 'అన్నాత్తే' సినిమాలో ఓ హీరోయిన్గా చేస్తోంది మీనా. దీపావళి కానుకగా ఈ ఏడాది నవంబరు 4న థియేటర్లలోకి రానుంది ఆ సినిమా. మరోవైపు వెంకటేశ్‌తో కలిసి 'దృశ్యం 2'లోనూ ప్రధాన పాత్ర పోషించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: