ఎంత కాదన్నా... చీరతో వచ్చే అందమే వేరు. ఇప్పటి ఫ్యాషన్ వస్త్రాల్లో లేని సొగసు, సౌందర్యం చీరలో ఉంది. అయితే చీర కట్టు కూడా ఓ కళే. అది అందరికీ రాదు. "నాక్కూడా చీరలంటే ఇష్టమే. కానీ దాంతో నాకు చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి" అంటోంది పూజా హెగ్డే.
"హైస్కూలు రోజుల్లోనే చీర కట్టాను. స్కూల్లో ఓ ఫంక్షన్‌కు తొలిసారి చీర కట్టుకుని వెళ్లాను. అది మా అమ్మ చీర. నాకు బాగా కుదిరింది. మా టీచర్లు నన్ను ఎంత మెచ్చుకున్నారో. కానీ.. చీర కట్టుకోవడం నాకు అదే తొలిసారి కాబట్టి చాలా ఇబ్బందిపడ్డాను. నా ఒంటి నుంచి ఎప్పుడు జారిపోతుందో అని ప్రతి క్షణం భయపడ్డాను. ఇంటికి రాగానే ఒక్క సెకను కూడా ఆలస్యం చేయకుండా నా మామూలు డ్రస్సింగ్ స్టైల్‌కి వచ్చేశాను. ఇప్పటికీ చీర కట్టుకోవడం అంటే కొంచెం భయమే. ఇంట్లో పూజలు, వేడుకలు జరుగుతున్నప్పుడు తప్పదు గానీ, పార్టీలకు వెళ్లేటప్పుడు చీర జోలికి వెళ్లను."
-పూజా హెగ్డే, హీరోయిన్
ఇటీవలే 'అల వైకుంఠపురములో' చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది పూజ. ప్రస్తుతం అఖిల్ సరసన 'మోస్ట్ ఎబిజిబుల్ బ్యాచ్‌లర్' చిత్రంలో నటిస్తోంది. ప్రభాస్ కొత్త సినిమాలోనూ ఆడిపాడబోతుంది.