ETV Bharat / sitara

లాక్‌డౌన్‌ విరామం.. లుక్కులపై ప్రయోగం - telugu movies latest news

కరోనా వల్ల ఏర్పడ్డ లాక్‌డౌన్‌తో చిత్ర పరిశ్రమ కూడా పూర్తిగా స్తంభించి పోయింది. చిత్రీకరణలు లేక అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయాన్ని కొందరు హీరోలు తమ లుక్కుని మార్చుకోవడానికి ఉపయోగిస్తున్నారు.

heroes concentrate on his looks
లాక్‌డౌన్‌ విరామం.. లుక్కులపై ప్రయోగం
author img

By

Published : Apr 6, 2020, 7:48 PM IST

లాక్​డౌన్​తో వచ్చిన ఈ విరామ సమయాన్ని తమ లుక్కులు మార్చుకోవడానికి ఉపయోగిస్తున్నారు కొందరు యువ కథానాయకులు. ఇంతకీ వారెవరో కాదు.. నిఖిల్, మంచు మనోజ్‌. నిఖిల్‌ ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ 2’ను ప్రారంభించగా.. మనోజ్‌ ‘అహం బ్రహ్మాస్మి’ అనే పాన్‌ ఇండియా చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ రెండు చిత్రాలు.. రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలు కావల్సిన తరుణంలో కరోనా వల్ల తాత్కాలికంగా ఆగిపోయాయి.

అయితే ఈ అనుకోని విరామాన్ని ఈ ఇద్దరు యువ హీరోలు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. నిఖిల్‌ ఈ సూపర్‌ హిట్‌ సీక్వెల్‌ కోసం సిక్స్‌ ప్యాక్‌ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించి ట్విటర్‌ వేదికగా ఓ ఆసక్తికర ఫొటోను పంచుకున్నారు ఆయన. ఈ చిత్రంలో ఆయన ఆరు పలకల దేహంతో స్టైలిష్‌గా దర్శనమిచ్చారు. ‘‘కసరత్తులు కొనసాగుతున్నాయి. ఇంకో నాలుగు వారాల్లో నా లక్ష్యాన్ని చేరుకుంటా’’ అని ఆ ఫొటోకు ఓ వ్యాఖ్యను జోడించాడు నిఖిల్‌.

మంచు మనోజ్‌ సైతం ‘అహం బ్రహ్మాస్మి’ కోసం ఓ కొత్త లుక్‌ను ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ లాక్‌డౌన్‌ కాలాన్ని తన లుక్‌ కోసం వినియోగిస్తున్నట్లు తాజాగా ట్విటర్‌ వేదికగా కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. వీటిలో ఆయన కోర మీసాలు, క్లీన్‌ షేవ్‌తో లవర్‌బాయ్‌లా దర్శనమిచ్చారు. ‘‘చిత్రీకరణలు లేక ప్రస్తుతం ఇంట్లోనే గడుపుతున్న ఈ విరామ సమయంలో ఈ కొత్త లుక్‌ ప్రయత్నించా. ఇలా క్లీన్‌ షేవ్‌లో నన్ను నేను చూసుకోవడం చాలా బాగుంది. అందరూ ఈ కాలాన్ని నాలాగే సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి’’ అని ఆ ఫొటోలకు ఆసక్తికర వ్యాఖ్యను జోడించారు.

ఇవీ చూడండి: 'దేశంలో తబ్లీగీ వల్లే రెట్టింపు కేసులు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.