మూడో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పలువురు సెలబ్రిటీలు చురుగ్గా పాల్గొంటున్నారు. డార్లింగ్ ప్రభాస్ ఇటీవలే మొక్కలు నాటగా, ఇప్పుడు హీరో విశ్వక్సేన్.. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ దగ్గర్లోని జీహెచ్ఎంసీ పార్కులో మొక్క నాటారు. హీరోలు అల్లు శిరీష్, కార్తికేయలతో పాటు నటుడు అభినవ్ గోమటం, దర్శకుడు శైలేష్లకు ఛాలెంజ్ విసిరారు.
![hero Vishwak Sen participate Green India Challenge](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7660330_viswa.jpg)
మనిషి బతికేందుకు మొక్కలు ఎంతో అవసరమని చెప్పిన విశ్వక్సేన్.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొనడం గొప్పపని అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కథానాయకుడు 'పాగల్' అనే సినిమాలో నటిస్తున్నారు.
ఇవీ చదవండి: