తన మొబైల్ నంబర్‌ను భాజాపా తమిళనాడు ఐటీ సెల్ లీక్ చేసిందని ప్రముఖ హీరో సిద్ధార్థ్ ఆరోపించారు. దీనివల్ల తనతో పాటు కుటుంబసభ్యులను పలువురు ఫోన్ చేసి దూషించడం, రేప్ చేస్తామని అనడం, చంపేస్తామని బెదిరించడం చేస్తున్నారని ట్వీట్ చేశారు. అయితే ఆ కాల్స్ అన్నింటినీ రికార్డు చేశానని, వాటిని పోలీసులు అందజేయనున్నానని చెప్పారు.
గత 24 గంటల్లో 500కు పైగా కాల్స్ వచ్చాయని సిద్దార్థ్ తన ట్విట్టర్లో రాసుకొచ్చారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాను ట్యాగ్ చేస్తూ ఈ పోస్ట్ చేశారు. తనను పలువురు బెదిరించిన స్క్రీన్షాట్లను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తమిళనాడు బీజేపీ సభ్యులు కొందరు తన ఫోన్ నంబర్ లీక్ చేసి, తనపై దాడి చేసి, వేధించమని పోస్టులు పెడుతున్నారని తెలిపారు.
-
This is one of many social media posts by BJP TN members leaking my number yesterday and telling people to attack and harass me.
— Siddharth (@Actor_Siddharth) April 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
"Ivan inimela vaaye thirakka koodathu" (this fellow must never open his mouth again)
We might survive Covid. Will we survive these people? pic.twitter.com/dYOQMsEewi
">This is one of many social media posts by BJP TN members leaking my number yesterday and telling people to attack and harass me.
— Siddharth (@Actor_Siddharth) April 29, 2021
"Ivan inimela vaaye thirakka koodathu" (this fellow must never open his mouth again)
We might survive Covid. Will we survive these people? pic.twitter.com/dYOQMsEewiThis is one of many social media posts by BJP TN members leaking my number yesterday and telling people to attack and harass me.