నటుడు రామ్ పోతినేని కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో రామ్ తాతయ్య మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన ఓ భావోద్వేగ ట్వీట్ పెట్టారు. కుటుంబం కోసం తన తాతయ్య ఎంతో శ్రమించారని రామ్ అన్నారు.
"తాతయ్య.. విజయవాడలో ఓ లారీ డ్రైవర్‌గా ప్రారంభమై ఉన్నత శిఖరాలకు వెళ్లిన మీ జీవితం మాకు ఎన్నో పాఠాలు నేర్పించింది. కుటుంబసభ్యులకు అన్ని రకాల వసతులు, సౌకర్యాలు అందించడం కోసం ఆ రోజుల్లో మీరు లారీ టైర్లపైనే నిద్రించేవాళ్లు. మీది రాజు లాంటి మనసు. జేబులో ఉన్న డబ్బుని బట్టి ఎవరూ ధనవంతులు కాలేరని, కేవలం మంచి మనస్సు వల్లే ప్రతిఒక్కరూ ధనవంతులు అవుతారని మీరే మాకు నేర్పించారు. మీ పిల్లలందరూ ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే దానికి మీరే కారణం. కానీ, ఇప్పుడు మీ మరణవార్త నన్ను ఎంతో కలచివేసింది. నా హృదయం ముక్కలైంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నా"
-రామ్ ట్వీట్.
ప్రస్తుతం రామ్.. తమిళ దర్శకుడు లింగుస్వామితో కలిసి 'రాపో 19' వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. హీరోయిన్గా 'ఉప్పెన' భామ కృతిశెట్టి ఎంపికైంది.
ఇదీ చూడండి: హ్యాపీ బర్త్‌డే: ఈ 'రామ్'డు ఇస్మార్ట్ బాలుడు!