కథానాయకుడు నితిన్.. వరుస చిత్రాలతో జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన 'రంగ్‌దే', 'అంధాదున్' రీమేక్‌తో పాటు చంద్రశేఖర్ యేలేటి సినిమాలోనూ నటిస్తన్నారు. ఇవన్నీ ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లాయి. వీటితో పాటే కృష్ణచైతన్యతో 'పవర్‌పేట' అనే చిత్రాన్ని చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇది నితిన్ కెరీర్లోనే అత్యంత భారీ చిత్రం. దీనిని రెండు భాగాలుగా తీయబోతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పూర్వనిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. కరోనా పరిస్థితులు చక్కబడితే అప్పుడు సినిమాను ప్రారంభించేలా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
1960 నుంచి 2020 వరకూ
'పవర్‌పేట'.. ఓ వైవిధ్య కథతో రూపొందనున్న పీరియాడికల్ చిత్రం. 1960 నుంచి 2020 వరకు నడిచే కథాంశమని సమాచారం. దీంట్లో నితిన్ 18 ఏళ్ల యువకుడిగా, 40 ఏళ్ల వ్యక్తిగా, 60 ఏళ్ల వృద్ధుడిగా దర్శనమివ్వబోతున్నాడు. ఇప్పుడీ గెటప్పుల కోసమే ప్రత్యేకంగా హాలీవుడ్ నిపుణులను తీసుకొస్తున్నారట. ఇందులో కథానాయికగా కీర్తి సురేశ్ ఎంపికైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్‌దే' చిత్రంలో నటిస్తున్నారు.
ఇవీ చదవండి:
- దర్శకుడిని కాపీ కొట్టా అందుకే ప్రశంసలు: నితిన్
- ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్నా: నితిన్
- హీరో నితిన్ లగ్గమాడబోయే పిల్లదెక్కడో తెలుసా?
- నితిన్ 18 ఏళ్ల కెరీర్లో ఆసక్తికర విషయమదే
- 'అంధాదున్' తెలుగు రీమేక్‌లో శిల్పాశెట్టి!
- 'మహానటి'తో మరోసారి టాలీవుడ్ భీష్ముడి జోడి!
- హీరో నితిన్ పెళ్లికి చిక్కులు.. అందువల్లేనా!
- 'కెరీర్ విషయంలో బాధపడ్డా.. ప్రేమకథ చేయొద్దనుకున్నా'