ప్రతినాయక పాత్రలను పోషించడానికి నేటి యువతరం వెనకాడటం లేదు. ఎలాంటి పాత్రైనా అందులో వాళ్ల సత్తా చూపించడానికి రెడీ అవుతున్నారు. 'బాహుబలి'లో రానా, 'సరైనోడు'లో ఆది పినిశెట్టి, 'గ్యాంగ్ లీడర్'లో కార్తికేయ.. ఇప్పటికి ఇలా ఎంతోమంది నెగటివ్ రోల్స్‌ను పోషించారు.
గతేడాది విడుదలైన 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రంలో నెగటివ్ రోల్లో నటించిన యువ కథానాయకుడు నవీన్‌చంద్ర.. ప్రస్తుతం వరుణ్‌తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలోనూ నెగటివ్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ఈ సిినిమా ఇటీవలే వైజాగ్‌లో చిత్రీకరణ ప్రారంభించుకుంది.
![hero naveen chandra will lead a negative roll in varuntej's boxer movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6207640_1.jpg)
సాయి కొర్రపాటి దర్శకుడిగా ఈ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమౌతున్నాడు. అల్లువెంకటేశ్, సిద్ధు నిర్మాణ బాధ్యతలు చూసుకుంటున్నారు.
ఇదీ చూడండి.. బన్నీతో సినిమా చేయాలని ఉంది: కృతి