టాలీవుడ్లో మరో కొత్త కాంబినేషన్‌కు రంగం సిద్ధమైంది. నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఇప్పటికే స్క్రిప్టు పూర్తయింది. పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే సినిమాను ప్రారంభిస్తారు. 'డిస్కో రాజా' తర్వాత ఆనంద్ తీయనున్న చిత్రమిదే. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్.ఎస్.కోనేరు నిర్మిస్తారు.
కల్యాణ్‌రామ్ ప్రస్తుతం మల్లిడి వేణు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అది పూర్తి చేసుకుని, వి.ఐ.ఆనంద్ సినిమా కోసం రంగంలోకి దిగబోతున్నారు.