ETV Bharat / sitara

Balakrishna: అభిమానికి బాలయ్య ఫోన్​.. రూ.40వేలు ఆర్థిక సాయం

author img

By

Published : Jun 13, 2021, 8:42 PM IST

ఏపీలోని చిత్తూరు జిల్లా గొల్లపల్లకి చెందిన మురుగేష్.. బాలయ్యకు వీరాభిమాని. కొన్ని రోజుల క్రితం చెట్టు మీద నుంచి కిందపడటంతో.. మంచానికే పరిమితమయ్యారు. విషయం తెలుసుకున్న బాలయ్య.. తన అభిమానిని ఫోన్​లో పరామర్శించి.. ఆర్థిక సాయం చేశారు.

Balakrishna: అభిమానికి బాలయ్య ఫోన్​.. రూ.40వేలు ఆర్థిక సాయం
Balakrishna: అభిమానికి బాలయ్య ఫోన్​.. రూ.40వేలు ఆర్థిక సాయం

హీరో బాలకృష్ణ.. అభిమానులపై ఆయనకు ఉన్న ఆప్యాయతను మరోసారి చాటుకున్నారు. ఏపీలోని చిత్తూరు జిల్లా గొల్లపల్లకి చెందిన మురుగేష్.. బాలయ్యకు వీరాభిమాని. కొన్ని రోజుల క్రితం చెట్టు మీద నుంచి మురుగేష్ కిందపడటంతో.. మంచానికే పరిమితమయ్యారు. విషయం తెలుసుకున్న బాలయ్య.. తన అభిమానిని ఫోన్​లో పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని తెలిపారు.

తాను మంచానికి పరిమితమవ్వటంతో.. తన తల్లి కూలి పనులు చేస్తోందని మురుగేష్ ఆవేదన చెందారు. బాలకృష్ణ ఆదేశాల మేరకు.. రూ.40 వేలు తక్షణ సహాయాన్ని అభిమానులు ఆయనకు అందించారు.

ఇదీ చదవండి: 'ప్రతిపక్షాల విమర్శలకు అభివృద్ధితోనే సమాధానం చెబుతాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.