అడివి శేష్ 'మేజర్'(major movie release date) సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ మూవీ రిలీజ్ డేట్ ఖరారైంది. 2022 ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నట్లు తెలియజేస్తూ ఓ మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. '120రోజులు షూటింగ్, 8 సెట్లు, 75 లొకేషన్స్, మూడు భాషలు' అంటూ వ్యాఖ్య రాసుకొచ్చింది. 26/11 దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. శశికిరణ్ తిక్క దర్శకుడు. సయీ మంజ్రేకర్, శోభిత దూళిపాళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహేశ్‌బాబు(mahesh babu new movie), సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలై ఈ చిత్ర పోస్టర్లు అభిమానులను సినిమాపై ఆసక్తిని రేకేస్తున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'అన్నాత్తే'(rajinikanth annaatthe movie) సినిమాలోని 'ఆహా కళ్యాణం' పాట విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో ఖుష్బూ, మీనా, కీర్తి సురేశ్(keerthy suresh) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి కానుకగా నవంబరు 4న థియేటర్లలోకి రానుందీ సినిమా. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ సహా కొన్ని సాంగ్స్ విడుదలై అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: టాప్ లెస్ ఫొటోలతో షాక్‌కు గురిచేసిన స్టార్ హీరోయిన్లు!