ETV Bharat / sitara

కేజీఎఫ్2: క్రూరత్వానికి ప్రతిరూపం 'అధీర'

బాలీవుడ్​ స్టార్ సంజయ్​దత్ పుట్టినరోజు సందర్భంగా 'కేజీఎఫ్ 2'లో ఆయన నటిస్తున్న అధీర పాత్ర కొత్తలుక్​ను విడుదల చేశారు. వినూత్న హెయిర్​స్టైల్​తో కనువిందు చేస్తున్నాడు.

author img

By

Published : Jul 29, 2020, 2:56 PM IST

Updated : Jul 29, 2020, 3:46 PM IST

కేజీఎఫ్2: క్రూరత్వానికి ప్రతిరూపం 'అధీర'
అధీర ఫస్ట్​లుక్

దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'కేజీఎఫ్‌ 2' ఒకటి. యశ్‌ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకుడు. తొలి భాగం ఘన విజయం సాధించడం వల్ల రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సంజయ్‌దత్‌ ఇందులో 'అధీర' పాత్ర పోషిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. కూరత్వానికి ప్రతిరూపం అధీర అంటూ ఫొటోను షేర్ చేశారు. ఇందులో ఆయన డిఫరెంట్‌ హెయిర్‌ స్టైల్‌లో నుదుటిపై టాటూ వేసుకుని కత్తికి తల ఆన్చి కనిపించారు. మొదటి భాగంలో అధీర పాత్ర అసలు కనిపించలేదు. మరి చాప్టర్‌-2లో ఈ పాత్ర ఎంత క్రూరంగా ఉంటుందో చూడాలి.

sanjay dutt as adheera
'అధీర'గా సంజయ్​దత్ లుక్

గరుడను చంపడానికి కేజీఎఫ్‌లోకి అడుగుపెట్టిన రాఖీ.. ఆ తర్వాత దాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు? కేజీఎఫ్‌ను దక్కించుకోవడానికి ప్రయత్నించిన రాజేంద్ర దేశాయ్‌, కమల్‌, గురు పాండ్యన్‌, ఆండ్రూస్‌లను ఎలా ఎదుర్కొన్నాడు? తన తమ్ముడి మరణవార్త తెలిసిన అధీర ఏం చేశాడు? గరుడ చనిపోయాడన్న వార్త తెలిసి ఇనాయత్‌ ఖలి దేశంపై దండెత్తడానికి ఎలాంటి ప్రణాళికలు వేశాడు? కేజీఎఫ్‌ను దక్కించుకున్న రాఖీని అంతం చేయడానికి భారత ప్రభుత్వం ఏం చేసింది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు 'కేజీఎఫ్‌2'లో సమాధానం లభించనుంది.

ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయిక. ప్రధానిగా రవీనా టాండన్‌ నటిస్తున్నారు. తెలుగు నటుడు రావు రమేశ్‌ ఓ కీలక పాత్రలో పోషిస్తున్నారు. హోంబాలే ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుందీ చిత్రం.

Last Updated : Jul 29, 2020, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.