సోమవారం అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు పుట్టినరోజు(Mahesh Babu Birthday) సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో సందడి మొదలైంది. ఆయన అభిమానులు మహేశ్ ఫొటోలను పంచుకుంటూ శుభాకాంక్షలు చెప్పడం మొదలు పెట్టారు. కొందరు తమ డీపీలను మార్చే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మహేశ్‌బాబుకు సంబంధించిన సరికొత్త ఫొటో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇంతకుముందెన్నడూ చూడని స్టైలిష్ లుక్‌లో మహేశ్ అలరిస్తున్నారు. ఫార్మల్ ఔట్‌ఫిట్‌లో స్టైల్‌కే బాస్‌లాగా, మరింత యంగ్‌గా కనిపిస్తున్నారు. 'మరొక సరదా ఫొటో షూట్' అంటూ అవినాష్ గోవర్కర్ తీసిన ఈ ఫొటోను మహేశ్ ట్విట్టర్‌లో పంచుకున్నారు.
-
Yet another fun shoot! 📸 @avigowariker at his best again! pic.twitter.com/miQ0C9qykt
— Mahesh Babu (@urstrulyMahesh) August 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Yet another fun shoot! 📸 @avigowariker at his best again! pic.twitter.com/miQ0C9qykt
— Mahesh Babu (@urstrulyMahesh) August 8, 2021Yet another fun shoot! 📸 @avigowariker at his best again! pic.twitter.com/miQ0C9qykt
— Mahesh Babu (@urstrulyMahesh) August 8, 2021
ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట'లో(Sarkaru Vaari Paata) నటిస్తున్నారు. సోమవారం మహేశ్ బర్త్‌డే సందర్భంగా చిత్ర బృందం మరో సర్‌ప్రైజ్‌ను అభిమానులకు ఇవ్వనుంది. ఇటీవల విడుదల చేసిన స్టైలిష్‌లుక్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్, రామ్ ఆచంట గోపీ ఆచంట నిర్మిస్తోన్న 'సర్కారువారి పాట' చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. సంక్రాంత్రి కానుకగా జనవరి 13, 2022లో(sarkaru vaari paata release date) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి.. శ్రుతి హాసన్‌కు ప్రభాస్ డిన్నర్ సర్ప్రైజ్