ETV Bharat / sitara

వాలంటైన్స్ డేకి సరిగ్గా సరిపోయే సినిమా 'సెహరి'

author img

By

Published : Feb 11, 2022, 6:53 AM IST

Sehari movie: ఫ్రెండ్ పెళ్లికి వెళ్లినప్పుడు వచ్చిన ఆలోచనే 'సెహరి' సినిమా అని నటుడు హర్ష్ చెప్పారు. అన్ని వయసుల వారికి నచ్చేలా ఈ చిత్రం ఉంటుందని అన్నారు.

sehari movie
సెహరి మూవీ

Harsh sehari: "టైటిల్‌కు తగ్గట్లుగానే 'సెహరి' సినిమా ఒక పండగలా ఉంటుంది. 'నువ్వునాకు నచ్చావ్‌' తరహాలో ఆద్యంతం వినోదం పంచుతుంది" అని అన్నారు హర్ష్‌ కనుమిల్లి. ఆయన్ను హీరోగా పరిచయం చేస్తూ.. జ్ఞానసాగర్‌ ద్వారక తీసిన చిత్రమే ఈ 'సెహరి'. అద్వయ జిష్ణురెడ్డి నిర్మించారు. సిమ్రాన్‌ చౌదరి కథానాయిక. ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు హీరో హర్ష్‌. ఆ విశేషాలివి..

harsh
హర్ష్

ఈ సినిమా ఏ స్థాయిలో ఉండనుందో ట్రైలర్‌తోనే స్పష్టంగా చూపించేశాం. వరుణ్‌ అనే ఓ అమాయక కుర్రాడు.. పెళ్లికూతురు అక్కను ప్రేమిస్తే ఏం జరిగింది? అన్నది ఈ చిత్ర కథాంశం. ఈ చిన్న పాయింట్‌ను ఆద్యంతం వినోదాత్మకంగా మలిచాం. ఒక పెళ్లికి వెళ్లినప్పుడు నా స్నేహితుడు 'పెళ్లి కూతురు సోదరి అందంగా ఉంది' అని చెప్పాడు. ఆ సందర్భంలో పుట్టిన ఆలోచన నుంచే నేనీ కథ రాసుకున్నా. ఓ బాలీవుడ్‌ ఏగ్రేడ్‌ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందీ చిత్రం. అలాగని ఇది ఏ ఒక్క వర్గానికో పరిమితమ్యే చిత్రం కాదు. అన్ని వయసుల వారికి నచ్చేలా ఉంటుంది.

* ఈ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డా. స్వతహాగా నాకు కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్‌ అంటే ఇష్టం. అందుకే తొలి ప్రయత్నంగా ఈ తరహా కథాంశం ఎంచుకున్నా. ఈ సినిమాలో ప్రతి పాత్రకు ఎంతో ప్రాధాన్యముంటుంది. సంగీత దర్శకుడు కోటికి ఈ చిత్రంలో బలమైన పాత్ర లభించింది. ఆయన నటన కొత్తగా ఉంటుంది. నాయిక సిమ్రాన్‌ నటనలో బెస్ట్‌ ఇచ్చింది. అభినవ్‌ గోమఠం కామెడీ ఫ్లేవర్‌తో ప్రేక్షకులు పూర్తిగా కనెక్ట్‌ అయిపోతారు. ప్రశాంత్‌ ఆర్‌.విహారి పాటలు అలరిస్తాయి. ద్వితీయార్ధంలో సిమ్రాన్‌ తనదైన నటనతో కట్టిపడేస్తుంది. ఈ వాలెంటైన్స్‌డేకి సరిగ్గా సరిపోయే చిత్రమిది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.