ETV Bharat / sitara

'చిత్ర నిర్మాణంలోనూ ఆత్మనిర్భర్​ భారత్​' - కరోనా ఫిల్మ్​ ఫెస్టివల్​

దేశంలోనే అన్ని రకాల మంచి సినిమాలను నిర్మించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్​ జావడేకర్​. ప్రస్తుతం స్మార్ట్​ఫోన్లతో లఘు చిత్రాలను నిర్మిస్తున్నారని, అది సమాచార విప్లవానికి తక్కువేమీ కాదని అభిప్రాయపడ్డారు.

Javadekar
ప్రకాశ్​ జావడేకర్
author img

By

Published : Dec 14, 2020, 5:18 PM IST

డాక్యుమెంటరీలు, లఘు చిత్రాలు సహా అన్ని రకాల మంచి సినిమాలను దేశంలోనే చిత్రీకరించేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్​ జావడేకర్​. ప్రస్తుతం ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్​ఫోన్​ ఉందని, చెప్పాల్సిన కథ ఉన్నవారంతా ఈరోజు చిత్ర నిర్మాతలేనన్నారు. అది సమాచార విప్లవానికి తక్కువేమీ కాదని అభిప్రాయపడ్డారు.

'ఆన్​లైన్​ ఇంటర్నేషనల్​ కరోనా వైరస్​ షార్ట్​ ఫిల్మ్​ ఫెస్టివల్'​లో భాగంగా ఈ మేరకు వ్యాఖ్యానించారు మంత్రి. పూర్తిగా ప్రాణాంతక వ్యాధి ఆధారంగా నిర్మించిన లఘు చిత్రాల కోసం చలన చిత్రోత్సవాన్ని ఏర్పాటు చేయటం ఒక కొత్త ఆలోచనగా పేర్కొన్నారు.

" స్మార్ట్​ఫోన్ల రాకతో ప్రజలు పౌరపాత్రికేయులుగా మారారు. వారు రికార్డ్​ చేసిన దానిని ఎడిట్​ చేసి తమ లఘు చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇది సమాచార విప్లవం. భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు(ఐఎఫ్​ఎఫ్​ఐ)లో 21 నాన్​ఫీచర్​ చిత్రాలను ప్రదర్శిస్తాం. అలాగే జాతీయ సినీ పురస్కారాల​ కార్యక్రమంలో 70 నిమిషాల నిడివి లఘు చిత్రాల కోసం పలు విభాగాలు ఉన్నాయి. ముంబయి అంతర్జాతీయ చలన చిత్రోత్సవం.. పలు డాక్యుమెంటరీలు, చిత్రనిర్మాతలకు అవార్డులు ఇస్తోంది. మంచి సినిమాలు, ప్రజలను కదిలించే సినిమాలు సహా అన్ని రకాల సినిమాలు దేశంలో నిర్మించేలా చూడాలన్నదే ప్రభుత్వ ప్రణాళిక. "

- ప్రకాశ్​ జావడేకర్​, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి.

ఇండియన్ ఇన్ఫోటైన్‌మెంట్ మీడియా కార్పొరేషన్ నిర్వహించిన ఈ కరోనా చలన చిత్రోత్సవానికి 108 దేశాల నుంచి 2,800 చిత్రాలు వచ్చాయి. ఇందులో ప్రధానంగా కరోనాను కట్టడి చేయటం, జాగ్రత్త చర్యలు, ఈ మహమ్మారి సమయంలో ప్రభావితమైన జీవితాల ఆధారంగా తీసినవి ఉన్నాయి.

ఇదీ చూడండి: గర్భంతో షూటింగ్​కు కరీనా కపూర్..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.