Pushpa movie: 'పుష్ప' థియేటర్లలో దుమ్ములేపుతోంది. ఈ క్రమంలో సక్సెస్ పార్టీలతో టీమ్ ఫుల్ బిజీగా ఉంది. ఇప్పుడు కాకినాడలోనూ శుక్రవారం సక్సెస్ ఈవెంట్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో తీసిన ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించారు. బన్నీ ఫెర్ఫార్మెన్స్‌కు విమర్శకుల నుంచి అద్భుత ప్రశంసలు దక్కుతున్నాయి. రష్మిక హీరోయిన్గా నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించగా, సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మించింది.
Hey sinamika movie: దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'హే సినామిక'. ఇప్పటికే దుల్కర్ ఫస్ట్‌లుక్ రిలీజవగా.. హీరోయిన్లు కాజల్ అగర్వాల్, అదితీ రావ్ హైదరీ లుక్స్‌ను గురువారం విడుదల చేశారు.
రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరియోగ్రాఫర్ బృంద మాస్టర్.. ఈ సినిమాతో డైరెక్టర్‌గా మారారు.
*గోపీచంద్ కొత్త సినిమాకు ముహుర్తం ఖరారైంది. తనతో 'లక్ష్యం', 'లౌక్యం' లాంటి హిట్లు తీసిన శ్రీవాస్.. మరోసారి గోపీచంద్‌తో పనిచేసేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
*ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న 'తీస్మార్ ఖాన్' గ్లాన్స్ వీడియోను గురువారం రిలీజ్ చేశారు. ఇందులో స్టూడెంట్, రౌడీ, పోలీస్‌గా మూడు పాత్రల్లో కనిపించి మెప్పించారు. ఇందులో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించారు. సాయి కార్తిక్ సంగీతమందించగా, కల్యాణ్‌జీ దర్శకత్వం వహించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
*శ్యామ్‌సింగరాయ్ సినిమాలోని 'తారా' అంటూ సాగే లిరికల్ సాంగ్ రిలీజైంది. శ్రీవిష్ణు 'అర్జున ఫల్గుణ' ట్రైలర్.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ చేతుల మీదుగా శుక్రవారం విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: