ETV Bharat / sitara

'పక్కా కమర్షియల్' లుక్​లో గోపీచంద్

author img

By

Published : Jun 11, 2021, 8:00 PM IST

గోపీచంద్, రాశీ ఖన్నా ప్రధానపాత్రల్లో మారుతి తెరకెక్కిస్తోన్న చిత్రం 'పక్కా కమర్షియల్'. శనివారం గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సర్​ప్రైజ్ ఇచ్చింది చిత్రబృందం.

Gopichand
గోపీచంద్

గోపీచంద్ కథానాయకుడిగా మారుతి తెర‌కెక్కిస్తోన్న చిత్రం 'పక్కా కమర్షియల్‌'. రాశీ ఖ‌న్నా నాయిక‌. గీతా ఆర్ట్స్‌ 2, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జూన్ 12న గోపీచంద్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఒక‌రోజు ముందుగానే అభిమానులకు స‌ర్‌ప్రైజ్ అందించింది చిత్ర బృందం. సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా గోపీచంద్‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ఓ పోస్ట‌ర్‌ని పంచుకుంది.

ఈ పోస్టర్​లో డ్యాన్స్ చేస్తూ క‌నిపించాడు గోపీచంద్. క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని, ట‌క్ చేసుకుని క్లాస్ లుక్‌లో ఆక‌ట్టుకుంటున్నాడు. ఓ పాట‌కు సంబంధించిన స‌న్నివేశంలోని ఫొటో ఇది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. మ‌రి ఆ అదిరిపోయే పాట ఏంటో వినాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇవీ చూడండి: నెటిజన్లపై 'జెర్సీ' నటి ఫైర్.. కారణం ఏంటంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.