'సీటీమార్' సినిమాతో థియేటర్లలోకి వచ్చిన హీరో గోపీచంద్.. మరో చిత్రంతో వచ్చే నెలలో సందడి చేయనున్నారు. 'ఆరడగుల బుల్లెట్'(gopichand aaradugula bullet) టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి దాదాపు నాలుగేళ్ల తర్వాత మోక్షం కలగనుంది.
ఇంతకీ ఏం జరిగింది?
గోపీచంద్, నయనతార(nayanthara kurian).. ఈ 'ఆరడుగుల బుల్లెట్' చిత్రంలో నటించారు. వక్కంతం వంశీ కథ అందించగా, బి.గోపాల్ దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీత దర్శకుడు. 2017లో రిలీజ్ చేయాలని అంతా సిద్ధం. కానీ విడుదలకు ముందు రోజు ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల సినిమాను ప్రదర్శించలేదు. అలా ఇప్పుడు విడుదల.. అప్పుడు విడుదల అంటూ వచ్చారు. చివరగా ఈసారి అక్టోబరులో రిలీజ్ చేస్తామని పోస్టర్ రిలీజ్ చేశారు.
అయితే ఈ సినిమాను థియేటర్లో లేదా ఓటీటీలో(ott full form) విడుదల చేస్తారనేది తెలియాల్సి ఉంది. మరి ఇప్పుడైనా 'ఆరడగుల బుల్లెట్' ప్రేక్షకుల ముందుకు వస్తుందా? ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయో?
ఇవీ చదవండి: