చెన్నైలో గురువారం మృతి చెందిన టాలీవుడ్ ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావుకు ఆదివారం అంత్యక్రియలు జరగనున్నాయి. శనివారం సాయంత్రం నుంచి భౌతికకాయన్ని చూసేందుకు సందర్శకులకు అనుమతిస్తామని ఆయన కొడుకు గొల్లపూడి రామకృష్ణ చెప్పారు.
"ఈ రోజు(గురవారం) ఉదయం 11:15 నిమిషాలకు గుండె పోటు(కార్డియాక్ అరెస్ట్)తో నాన్న(గొల్లపూడి మారుతీరావు) పరమపదించారు. వారి అంత్యక్రియలు ఆదివారం పొద్దున్న జరగనున్నాయి. శనివారం ఆయన భౌతికకాయన్ని ఇక్కడికి తీసుకువస్తాం. అప్పటి నుంచి సందర్శకులకు అనుమతిస్తాం" -గొల్లపూడి రామకృష్ణ, మారుతీరావు కుమారుడు