ETV Bharat / sitara

ఆలియా ఎమోషనల్ పోస్ట్.. '100 Crores' టీజర్ - kriti sanon prabhas adipurush

కొత్త సినీ అప్డేట్స్ వచ్చేశాయి. వీటిలో గంగూబాయ్ కతియావాడి, 100 క్రోర్స్, 7 డేస్ 6 నైట్స్ చిత్రాల సంగతులతో పాటు కృతిసనన్ ఇన్​స్టా ఫాలోవర్స్ గురించి ఉన్నాయి.

Gangubai kathiawadi, 100 Crores, 7 Days 6 Nights movie updates
మూవీ న్యూస్
author img

By

Published : Jun 27, 2021, 8:33 PM IST

*'ఆర్ఆర్ఆర్'(RRR) బ్యూటీ ఆలియా భట్(Alia Bhatt) ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'గంగూబాయ్ కతియవాడి'(Gangubai Kathiawadi). ఈ చిత్ర షూటింగ్ ఆదివారంతో పూర్తయింది. ఈ సందర్భంగా ఇన్​స్టాలో భావోద్వేగ పోస్టు పెట్టిన ఈమె.. పలు ఫొటోల్ని షేర్ చేసింది. ముంబయి కామటిపురలో గతంలో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకుడు.

*'100 క్రోర్స్'(100 CRORES teaser) సినిమా టీజర్​ అలరిస్తోంది. నోట్ల రద్దు సమయంలో నల్లధనం ఉన్న కొందరు వ్యక్తులు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు? కొత్త నోట్లను దొంగతనం చేయాలనుకున్న వారి ఎత్తుగడ ఫలించిందా? లేదా అనేది ఈ చిత్రంలో చూపించనున్నారు. కల్పిత కథతో తెరకెక్కిన ఈ సినిమాలో రాహుల్ ప్రధాన పాత్రలో నటించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

D*ఎమ్మెస్ రాజు దర్శకుడిగా తీస్తున్న రెండో సినిమా '7 డేస్ 6 నైట్స్'(7 Days 6 Nights). కరోనా వల్ల ఆగిన షూటింగ్.. ఆదివారం నుంచి మళ్లీ మొదలైంది. దీనిని వెల్లడించిన చిత్రబృందం.. ఫొటోలను అభిమానులతో పంచుకుంది. సెప్టెంబరులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

7 Days 6 Nights movie shooting
'7 డేస్ 6 నైట్స్' షూటింగ్​లో ఎమ్మెస్ రాజు

*'ఆదిపురుష్'(Adipurush) బ్యూటీ కృతిసనన్(Kriti Sanon).. ఇన్​స్టాలో 40 మిలియన్ల మార్క్​ను అందుకుంది. ప్రస్తుతం ఈమె పలు హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అలానే 'అల వైకుంఠపురములో'(Ala Vaikunthapurramuloo) హిందీ రీమేక్​లోనూ హీరోయిన్​గా ఈమెకే అవకాశం దక్కింది.

kriti sanon
కృతిసనన్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.