ETV Bharat / sitara

ఆసక్తికరంగా బాక్సాఫీస్ వార్.. విజయం ఎవరిదో? - బాలీవుడ్ బాక్సాఫీస్ వార్.. విజయమెవరిదో

బాలీవుడ్​లో వరుసగా విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు దర్శకనిర్మాతలు. దీంతో కొన్ని చిత్రాల మధ్య పోటీ తప్పట్లేదు. ఈ ఏడాదిలో విడుదలయ్యే సినిమాల్లో ఏ రెండింటి మధ్య పోటీ ఆసక్తికరంగా ఉండనుంది? అవి ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి?

Friday Clashes
బాలీవుడ్ బాక్సాఫీస్ వార్
author img

By

Published : Feb 25, 2021, 6:22 PM IST

కరోనా ఆంక్షలు తొలగిపోవడం వల్ల థియేటర్లలో సందడి వాతావరణం కనిపిస్తోంది. తొలుత 50 శాతం సామర్థ్యాన్ని సినిమా హాళ్లలోకి అనుమతించిన కేంద్రం.. తర్వాత పూర్తి సామర్థ్యంతో షోలు నడపొచ్చని స్పష్టం చేసింది. దీంతో విడుదల వాయిదా పడుతూ వస్తోన్న సినిమాలకు మోక్షం లభించినట్లయింది. టాలీవుడ్​తో పాటు బాలీవుడ్​లోనూ వరుసగా విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు దర్శకనిర్మాతలు. తద్వారా ప్రతి శుక్రవారం ఒకటి కంటే ఎక్కువ సినిమాలు అభిమానుల్ని పలకరించబోతున్నాయి. అందులో కొన్ని భారీ చిత్రాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్​లో ఒకేరోజున కొన్ని పెద్ద సినిమాలు విడుదల​ కాబోతున్నాయి. ఇంతకీ వాటి సంగతేంటి?

పృథ్వీరాజ్ వర్సెస్ జెర్సీ (నవంబర్ 5)

దీపావళి కానుకగా ఈ ఏడాది నవంబర్ 5న రెండు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అవి అక్షయ్ కుమార్ 'పృథ్వీరాజ్', షాహిద్ కపూర్ 'జెర్సీ'. ఇప్పటికే 'కబీర్ సింగ్'​తో భారీ విజయాన్ని అందుకున్న షాహిద్​, వరుస చిత్రాలతో జోరు చూపిస్తోన్న అక్షయ్​తో పోటీపడుతుండటం ఆసక్తికరంగా మారింది. 'పృథ్వీరాజ్​'లో మానుషి చిల్లర్​ హీరోయిన్​గా పరిచయమవుతుండగా, 'జెర్సీ'లో మృనాల్ ఠాకూర్ కథానాయికగా నటించింది.

Friday Clashes
పృథ్వీరాజ్ వర్సెస్ జెర్సీ

ముంబయి సాగా వర్సెస్ సందీప్ కౌర్ పింకీ ఫరార్ (మార్చి 19)

జాన్ అబ్రహం, ఇమ్రాన్ హష్మీ, సునీల్ శెట్టి, కాజల్ అగర్వాల్, రోహిత్ రాయ్, అంజనా సుఖానీ, మహేశ్ మంజ్రేకర్, ప్రతీక్ బబ్బర్ లాంటి స్టార్ నటులతో సన్హయ్ గుప్తా తీస్తున్న అండర్ వరల్డ్ డ్రామా 'ముంబయి సాగా'. మార్చి 19న విడుదల కానుంది. ఇదే రోజు దివాకర్ బెనర్జీ తీసిన బ్లాక్ కామెడీ డ్రామా 'సందీప్ కౌర్ పింకీ ఫరార్'​ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అర్జున్ కపూర్, పరిణీతి చోప్రా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

Friday Clashes
ముంబయి సాగా వర్సెస్ సందీప్ ఔర్ పింకీ ఫరార్

రాధే వర్సెస్ సత్యమేవ జయతే 2 (ఈద్ వీకెండ్)

సల్మాన్ ఖాన్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న చిత్రం 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్'. ఈ సినిమాను ఈద్ కానుకగా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. దిశా పటానీ హీరోయిన్​. మే 13న రిలీజ్ చేయనున్నారు. తర్వాత రోజు(మే 14) జాన్ అబ్రహం నటించిన 'సత్యమేవ జయతే 2' విడుదల కానుంది.

Friday Clashes
రాధే వర్సెస్ సత్యమేవ జయతే

గంగూబాయ్ కతియావాడి వర్సెస్ రాధేశ్యామ్ (జులై 30)

ప్రభాస్ హీరోగా, రాధాకృష్ణ కుమార్ కాంబోలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం 'రాధేశ్యామ్'. పూజా హెగ్డే హీరోయిన్​. జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అదే రోజు ఆలియా భట్ 'గంగూబాయ్ కతియావాడి' కూడా బరిలో నిలిచింది. దీంతో ఎవరు విజయం సాధిస్తారా అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

Friday Clashes
గంగూబాయ్ కతియావాడి వర్సెస్ రాధేశ్యామ్

షేర్షా వర్సెస్ మేజర్ (జులై 2)

ఈ రెండు చిత్రాలు ఆర్మీ నేపథ్యంలో, దేశభక్తి ప్రధానంగా సాగేవే. 'షేర్షా'లో పరమ్​ వీర్ చక్ర గ్రహీత, కార్గిల్ హీరో విక్రమ్ బత్రా పాత్రలో సిద్దార్థ్ మల్హోత్రా కనిపించనున్నారు. కియారా అడ్వాణీ హీరోయిన్. టాలీవుడ్ నటుడు అడివి శేష్ పాన్ ఇండియా చిత్రం 'మేజర్'. ఇందులో 26/11 ముంబయి దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ రెండు చిత్రాలు జులై 2న విడుదల కానున్నాయి.

Friday Clashes
షేర్షా వర్సెస్ మేజర్

ఇవీ చూడండి: లేటైనా లేటెస్ట్​గా హిట్​ కొట్టిన చిత్రాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.