అభిమానులను అలరిస్తున్న టాలీవుడ్ యువహీరోల్లో విశ్వక్సేన్(Viswaksen) ఒకరు. ఈ నగరానికి ఏమైంది, ఫలక్నుమా దాస్, హిట్ తదితర చిత్రాలతో ఆకట్టుకున్నారు. త్వరలో 'పాగల్'(Paagal) అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ఇతడు నటిస్తున్న ఓ ద్విభాషా చిత్రంలో ఏకంగా నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారని సమాచారం.
హారర్ థ్రిల్లర్గా తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న సినిమా 'అక్టోబరు 31 లేడీస్ నైట్'(October 31st Ladies Night). విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో మేఘా ఆకాశ్, మాంజిమా మోహన్, రెబా జాన్, నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటిస్తున్నారట. హాలోవీన్ నేపథ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. తెలుగులో ఈ తరహాలో రూపొందుతున్న తొలి సినిమా ఇదేనట! త్వరలో దీని గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది.

ఇవీ చదవండి: