సుశాంత్ ఆత్మహత్య విషయమై అతడి ప్రియురాలు, హీరోయిన్ రియా చక్రవర్తిపై బిహార్ పట్నా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సుశాంత్ తండ్రి కేకేసింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తన కొడుకును ప్రేమ పేరుతో మోసం చేసి దోచుకుందని ఆరోపించారు కేకే సింగ్. సుశాంత్ మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకోవడంలో రియా ప్రమేయం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ముంబయికి నలుగురు
రియాపై కేసు నమోదు చేసిన పట్నా పోలీసులు.. సుశాంత్ ఆత్మహత్యపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే నలుగురు పోలీస్ అధికారుల బృందం ముంబయికి చేరుకుంది. వారి దగ్గర నుంచి కేసుకు సంబంధించిన విషయాలను వీరు సేకరిస్తున్నారు.
ఇది చూడండి 'నేను బతికితే నీవు ఎక్కడున్నా పట్టుకుంటా'