ETV Bharat / sitara

'కేబీసీ'పై వ్యతిరేకత.. అమితాబ్​పై​ కేసు నమోదు - కౌన్​ బనేగా కరోడ్​పతి వార్తలు

బాలీవుడ్​ మెగాస్టార్ అమితాబ్​ బచ్చన్​ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న'కౌన్​ బనేగా కరోడ్​పతి'పై సోషల్​మీడియాలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ షోలో హిందూ మనోభావాలను దెబ్బతీశారంటూ కొంతమంది నెటిజన్లు ఆరోపించగా.. నిర్వాహకులతో పాటు అమితాబ్​పై కేసు నమోదైంది.

FIR against Amitabh Bachchan, KBC makers for hurting 'Hindu sentiments'
'కౌన్​ బనేగా క్రోర్​పతి' నిర్వాహకులపై కేసు నమోదు
author img

By

Published : Nov 3, 2020, 4:08 PM IST

Updated : Nov 3, 2020, 4:23 PM IST

బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​ బుల్లితెరపై వ్యాఖ్యాతగా చేస్తున్న 'కౌన్​ బనేగా కరోడ్​పతి' నిర్వాహకులపై ఎఫ్​ఐఆర్​ నమోదైంది. కార్యక్రమంలో అడిగిన ఓ ప్రశ్న వల్ల హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కొంతమంది నెటిజన్లు ఆరోపించారు. దీంతో అమితాబ్​తో పాటు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు పోలీసులు.

ఈ కార్యక్రమంలో భాగంగా కరం వీర్​తో​ జరిగిన ఎపిసోడ్లో బచ్చన్​ అడిగిన ప్రశ్నకు కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. 6,40,000 రూపాయల ప్రశ్నలో భాగంగా అంబేద్కర్​కు సంబంధించిన ప్రశ్నను అమితాబ్​ అడిగారు.

ఆ ప్రశ్నకు అమితాబ్​ చెప్పిన వివరణపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనికి సంబంధించిన క్లిప్ వైరల్​గా మారింది. దీంతో 'బాయ్​కాట్ కేబీసీ' అనే హ్యాష్​ట్యాగ్​ ట్రెండింగ్​గా మారింది. కార్యక్రమ నిర్వాహకులు 'వామపక్ష భావజాలాన్ని కలిగి ఉన్నారని.. హిందూ మనోభావాలను దెబ్బతీశారని' కొంతమంది ఆరోపిస్తున్నారు.

Last Updated : Nov 3, 2020, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.