ETV Bharat / sitara

పచ్చని మొక్కల మధ్య గడిపేస్తున్న సినీ తారలు...

author img

By

Published : Jul 26, 2020, 12:42 PM IST

ఎప్పుడూ మేకప్పులు, సినిమాల్లో మునిగిపోయి ఉండే తారలు తోటల బాట పట్టారు. మట్టితో చెలిమి చేస్తున్నారు. కరోనా కారణంగా షూటింగులు లేకపోవడంతో చాలా మంది నటీనటులు తమ ఖాళీ సమయాన్ని పచ్చని మొక్కల మధ్యలో గడిపేస్తున్నారు. తోటపనిని ఆస్వాదిస్తూ ఆహ్లాదం పొందుతున్నారు.

film stars started doing gardening during lock down
పచ్చని మొక్కల మధ్య గడిపేస్తున్న సినీ తారలు...

సమంత సేంద్రియ సాగు

ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే సమంతకు ఇప్పుడు బోలెడంత ఖాళీ సమయం దొరకింది. దాంతో తన ఇంటి మీద సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తోంది. ఈ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంది. వ్యవసాయం గురించి తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని అంటోంది ఈ అందాల భామ.

జుహీ ఆరోగ్య బాట

అందం, అద్భుత అభినయంతో ఆసేతు హిమాచలాన్ని ఆకట్టుకున్న బాలీవుడ్‌ బంగారుబొమ్మ జుహీచావ్లా. ఈ సీనియర్‌ నటి మేకప్‌ వదిలేసి మట్టితో సావాసం చేస్తోంది. ఇంటి చుట్టూ ఉండే స్థలంలో కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచు తోంది. తోటపనితో మానసిక ఆనందం, ఆరోగ్యం సొంతమవుతాయంటోంది.

నభా సొంత కూరలు!

ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాతో తెలుగువారిని అలరించిన నటి నభా నటేశ్‌. షూటింగ్‌లు ఆగిపోవడంతో తనకు ఇష్టమైన సాగు బాట పట్టింది. ఇంటి చుట్టూ ఆకుకూరలు, కూరగాయలు పండిస్తూ ఖాళీ సమయాన్ని గడిపేస్తోంది. వంట కోసం ఆకుకూరలు కోస్తున్న వీడియోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

శిల్ప సంతోషం

మన పిల్లల ఎదుగుదలను చూడటంలో ఎంత ఆనందం ఉంటుందో, మొక్కల పెంపకంలో కూడా అంతే సంతోషం ఉంటుందంటోంది శిల్పాశెట్టి. ఇంటి చుట్టూ సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగుచేస్తోందీ సాగర కన్య. మన కష్టానికి లభించే ఫలితాన్ని చూస్తే ఆ ఆనందమే వేరు అంటూ మురిసిపోతోంది.

ప్రకాష్‌ రాజ్‌ ప్రకృతి ప్రేమ

సినిమాలతో పాటు రాజకీయాలు, సాహిత్యంలో కూడా చురుగ్గా ఉండే ప్రకాశ్‌రాజ్‌కు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. కరోనాతో లభించిన ఖాళీ సమయాన్ని తన ఫాంహౌస్‌లో గడిపేస్తూ సేద్యం చేస్తున్నాడు. వ్యవసాయం అంటే ప్రకృతితో కలిసి జీవించడమే అన్నది ఈ విలక్షణ నటుడి అభిప్రాయం.

పాయల్‌ నర్సరీ

‘ప్రయాణం’ సినిమాతో టాలీవుడ్‌లో ప్రవేశించిన నటి పాయల్‌ ఘోష్‌ కూడా తోటపనిలో మునిగిపోయింది. చిన్నప్పుడు నాన్నమ్మ తాతయ్యలతో కలిసి తోట పని చేస్తూ బోలెడన్ని కథలు వినేదాన్నని చెబుతోందీ భామ. తన ఇంటి చుట్టూ ఉన్న రకరకాల మొక్కల్ని చూసి స్నేహితులు నర్సరీ అని పిలుస్తున్నారట.

చిన్ననాటి నుంచి ఇష్టం

ప్రతినాయక పాత్రల్లో మెప్పిస్తున్న కిశోర్‌ ఫాంహౌస్‌లో సేద్యం పనుల్లో తీరిక లేకుండా గడుపుతున్నాడు. చిన్నప్పటి నుంచి వ్యవసాయం, ప్రకృతి అంటే తనకు ఇష్టమట. రైతులకు సేంద్రియ వ్యవసాయం మీద అవగాహన కల్పించాలంటాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.